మంచు వారబ్బాయి మంచు మనోజ్ కి సామజిక స్పృహ ఎక్కువ. ఎక్కడ ఏ సంఘటన జరిగినా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటాడు. ప్రస్తుతం ప్రపంచమంతా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా.అగ్ర దేశాలే కరోనా ధాటికి వణికిపోతున్నాయి. ఇండియాలో కూడా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. 

దీనితో ప్రధాని మోడీ ఇటీవల ఆదివారం రోజు రాత్రి 9 గంటలకు ప్రతి ఒక్కరూ ఇళ్లలోని లైట్స్ ఆఫ్ చేసి గుమ్మాల వద్ద దీపాలు వెలిగించాలని పిలుపు నిచ్చారు. కరొనపై పోరాటంలో భాగంగా ఐక్యతని చాటేందుకు మోడీ ఈ పిలు ఇచ్చారు. 

ప్రధాని పిలుకు విశేష స్పందన లభించింది. ఆదివారం సాయంత్రం దెస ప్రజలంతా మోడీ మాటని పాటించారు. సెలెబ్రిటీలు కూడా దీప ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలోనే ఉండి చేయాలనీ.. రోడ్ల మీదికి రావద్దని మోడీ ప్రత్యేకంగా చెప్పారు. 

'అల వైకుంఠపురములో' రీమేక్.. ఇది కూడా ఆ హీరోకేనా!

కానీ కొందరు ఆకతాయిలు పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చారు. భవనాలపై కూడా క్రాకర్స్ కాల్చారు. ఆ వీడియోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీపాలు వెలిగించమని చెబితే క్రాకర్స్ కాల్చారు అంటూ మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు. 

'ఇడియట్స్ క్రాకర్స్ కాల్చడం ఆపండి.. మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించడం లేదా.. చదువుకుని 'జి' బలిసిన వాళ్లే ఈ పని చేశారు. మనుషుల్లాగా పరిణితితో వ్యవహరించండి అని మనోజ్ సూచించాడు.