హైదరాబాద్ జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నలుగురు వ్యక్తులు ఆమెని రేప్ చేసి ఆ తరువాత పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఇంత దారుణంగా, క్రూరంగా ప్రవర్తించిన వారు బతకడానికి వీళ్లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కన్నకూతురిని కోల్పోయిన దిశ తల్లితండ్రులను సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తూ తమ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. హీరో మంచు మనోజ్ కూడా దిశ తల్లితండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన ఆవేశంతో రగిలిపోయారు. ఆడపిల్లలను గౌరవించమని తానెప్పుడూ చెబుతూ ఉంటానని.. ఈరోజు దిశకి జరిగిందే, నిర్భయ విషయంలో, తొమ్మిది నెలల పసిబిడ్డ విషయం కూడా జరిగిందని.. ఇలా రేప్ లు చేసుకుంటూ పొతే సమాజం ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదని అన్నారు.

బాలు గారు ఫోన్ చేసి తిడుతున్నారు.. తమన్ కామెంట్స్

దిశ విషయంలో కొందరు తను ఇంటికి ఫోన్ చేయకుండా పోలీసులకు ఫోన్ చేసి ఉండాల్సిందని, మరికొందరు ఆ సమయంలో బయట ఎందుకు తిరుగుతుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. మన ఆడపిల్లలు బయటికి రాకూడదా? రాత్రిళ్లు తిరగకూడదా? ఆ సెక్యూరిటీ మనం ఇవ్వలేమా? అంటూ ప్రశ్నించారు.

ఇలాంటి ఘటనల్లో వెంటనే శిక్షలు అమలయ్యే విధంగా చట్టాలు తీసుకురావాలని మనోజ్ అన్నారు. ఆడవాళ్ల జోలికి వచ్చే ఇలాంటి బాస్టర్డ్స్ ఎవరినీ వదలకూడదని అన్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ నిర్మాతగా మారి సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు.