మత్తు మంది కలిపి హీరోయిన్ పై అత్యాచారం చేసి, ఆపై వీడియో తీసి ఆమెను బెదిరించి డబ్బు లాగిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఒక కన్నడ హీరోయిన్ కి ఒక రెండు సంవత్సరాల కింద కాఫీ డే లో ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. తనని తాను ఒక కంపెనీకి సీఈఓ గా పరిచయం చేసుకున్నాడు. 

ఆ సదరు వ్యక్తి తన పేరు మోహిత్ అని ఒక కంపెనీ కి సీఈఓ అని, కంపెనీ ప్రమోషన్ కోసం బ్రాండ్ అంబాసిడర్ కోసం వెతుకుతున్నట్టుగా చెప్పాడు. సదరు హీరోయిన్ ని కంపెనీకి ప్రచారకర్తగా నియమించుకుంటున్నట్టుగా చెప్పాడు. 

ఆమెను తీసుకొని గోవాకు సైతం వెళ్ళాడు. అక్కడ ఫోటో షూట్ చేయించాడు. అలా  వారిద్దరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. ఆ సదరు మహిళపై కన్నేసిన ఆ కామాంధుడు ఆ సదరు హీరోయిన్ ని తన పుట్టినరోజు వేడుకకోసమని చెప్పి ఇంటికి ఆహ్వానించాడు. 

అక్కడ ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమె స్పృహ కోల్పోయాక ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ నీచ ఘటనను మొత్తం వీడియో తీసి ఆ హీరోయిన్ ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టాడు. 

తనకు గనుక డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరించాడు. ఆ యువతీ 11 లక్షల రూపాయలను ఇచ్చింది. మరోమారు 9 లక్షలు ఇచ్చుకుంది. మరోసారి అత్యాచారానికి కూడా ఒడిగట్టాడు. 

ఇలా వరుస బెదిరింపులతో అతడి ఆగడాలు పెచ్చు మీరడంతో... ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రంగంలోకి దిగి ఆ సదరు నీచుడిని అరెస్ట్ చేసారు.