నాలుగు పదుల వయసులో కూడా హాట్ నెస్ తో మలైకా అదరగొడుతోంది. ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయిన మలైకా 1998లో అర్భాజ్ ఖాన్ ని వివాహం చేసుకుంది. దాదాపు 19 ఏళ్ల వీరిద్దరి వివాహ  జీవితానికి బ్రేక్ పడింది. విభేదాల కారణంగా ఈ జంట 2017లో విడాకులతో విడిపోయారు. 

ప్రస్తుతం మలైకా అరోరా తనకన్నా వయసులో చిన్న అయిన అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది. ఇటీవల మలైకా కరీనా కపూర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షోకు అతిథి గా హాజరైంది. ఈ షోలో కరీనా కపూర్ మలైకాని తన డైవోర్స్ గురించి ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు మలైకా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 

వైరల్ వీడియో: ఇంట్లో త్రిష హాట్ డాన్స్.. ఫ్లోర్ అదిరిపోయింది

విడాకుల సమయంలో తాను కఠిన పరిస్థితులు ఎదుర్కొనాన్ని మలైకా తెలిపింది. నా చుట్టూ పరిస్థితులు అనుకూలంగా లేవు. ప్రతి ఒక్కరూ నన్నే నిందించారు. విడాకులకు ముందు రోజు కూడా డివోర్స్ సరికాదని నన్నే హెచ్చరించారు. తన చుట్టూ ఉన్న వ్యక్తులు ఇబ్బంది పడకూడదనే నేను విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నా. 

విడాకులకు ముందు రోజు నా కొడుకు అర్హాన్ నాతో చెప్పిన మాటలు మరచిపోలేను. అమ్మ నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో అలాగే చేయి.. నేను నిన్ను సంతోషంగా చూడాలని అనుకుంటున్నా అని చెప్పినట్లు మలైకా తన కొడుకు మాటలని గుర్తు చేసుకుంది. ఒక తల్లిగా నేను అర్హాన్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటా. కానీ క్లిష్ట పరిస్థితుల్లో తన బిడ్డే తనకు మద్దతు ఇచ్చినట్లు మలైకా చెప్పుకొచ్చింది.