టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన బలాన్ని నిరూపించుకున్నాడు. భారత్ అనే నేను - మహర్షి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న మహేష్ ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన కలెక్షన్స్ స్టాండర్డ్ గానే కొనసాగవుతున్నాయి.

సినిమా ఆరు రోజుల (ఎపి/తెలంగాణ) షేర్స్ కలెక్షన్స్ 78కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. మొదటిరోజే మహేష్ తన పవర్ ఏంటో చూపించాడు. ఈ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. జనవరి 11 ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ డే.. 33కోట్ల షేర్స్ తో బయ్యర్స్ కి ఆనందాన్ని ఇచ్చింది.

ఇక ఆ తరువాత రోజుల్లో కూడా అదే ఫ్లోలో కొనసాగిన సినిమా కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో 78కోట్లను దాటింది.   ఏపీ తెలంగాణాలో సినిమా  రైట్స్ 77కోట్ల ధర పలికినట్లు సమాచారం. అంటే సరిలేరు నీకెవ్వరు బయ్యర్స్ దాదాపు సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే. ప్రస్తుతం సినిమాకు మిక్సిడ్ టాక్ వస్తున్నప్పటికీ ఆడియెన్స్ ఫ్లో ఏ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కూడా మహేష్ సినిమాకు గట్టి పోటీని ఇస్తోంది. ఇక ఈ వీకెండ్ లో రెండు సినిమాల అసలైన యుద్ధం మరో లెవెల్ కి చేరుకోనుంది.