టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త యాంగిల్ లో కనిపించి సక్సెస్ అందుకున్న ప్రిన్స్ నెక్స్ట్ ఇంకాస్త పెద్ద సినిమాలతో హిట్స్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మహేష్ నెక్స్ట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ ఒక స్పైగా కనిపించబోతున్నాడట.

ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్న దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేసాడు. ఆ సినిమా తరువాత మహేష్ వెంటనే మరో రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తేవాలని ట్రై చేస్తున్నాడు. అందులో ఒక సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.  KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ గత కొన్ని వారల క్రితం మహేష్ కి ఒక కథ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం KGF 2 తో బిజీగా ఉన్న ప్రశాంత్ ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే మహేష్ సినిమాని స్టార్ట్ చేయాలనీ చూస్తున్నాడు.

ఇక మహేష్ - ప్రశాంత్ కాంబినేషన్ లో తెరక్కనున్న సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించే అవకాశం ఉందని సమాచారం. మరీ ఆ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.  వరుసగా నెక్స్ట్ 2, 3 ఇయర్స్ మహేష్ టాలీవుడ్ స్టార్ దర్శకులను ముందే బుక్ చేసుకున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా మహేష్ చేసుకుంటున్న ఈ ప్లాన్ తో ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. మరీ ఆ సినిమాలతో సూపర్ స్టార్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.