కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనితో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది. సెలెబ్రిటీలు కూడా ఇళ్లల్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా తమ క్వారంటైన్ విశేషాలు షేర్ చేస్తున్నారు. తమ ఇంట్లో ఇలాంటి విశేషం జరిగినా సోషల్ మీడియాలో ఆ ఫోటోలు,వీడియోలు షేర్ చేస్తున్నారు. 

 

ఇలా సెలబ్రిటీల బర్త్ డే పార్టీలు చాలా గ్రాండ్ గా జరుగుతాయి. కానీ లాక్ డౌన్ కారణంగా ఎలాంటి పార్టీలు నిర్వహించడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్, టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి భార్య లారా దత్త 42వ జన్మదిన వేడుకలు క్రేజీగా జరిగాయి. 

మహేష్, చిరు, పవన్, రవితేజ బ్లాక్ బస్టర్స్ ని వాళ్ళు చెడగొట్టేశారు.. తెలుసా..

మహేష్ భూపతి తన సతీమణి బర్త్ డే పార్టీని వర్చువల్ గా నిర్వహించాడు. తన ఇంట్లో జరుగుతున్న బర్త్ డే పార్టీని ఆన్ లైన్ ద్వారా కుటుంబ సభ్యులకు, బంధువులకు లైవ్ ద్వారా చూపించాడు. బర్త్ డే పార్టీలో మహేష్ భూపతి, లారా దత్తా తో పాటు వారి కుమార్తె సైరా కూడా ఉంది. 

వర్చువల్ బర్త్ డే పార్టీ ముగిసింది.. హ్యాపీ బర్త్ డే లారా.. మరొకొన్ని దశాబ్దాలు దేవుడి ఆశీస్సులతో మనం ఇలాగే గడపాలి అని మహేష్ భూపతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.