అవును ..‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టేజీపై కనిపించిన చిరంజీవి,మహేష్ ఇప్పుడు ఒకే స్క్రీన్ ని పంచుకోబోతున్నారు. సూపర్,మెగా మల్టిస్టారర్ కు ఇది నాందీ వాచకం కాబోతోంది. అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే తెరపై ఓ మెగాద్బుతం జరగబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో మహేష్ బాబు గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.

కంటెంట్ ఉంటే చాలు.. గుడ్డిగా ఫాలో అయిపోతారు

అందుతున్న సమాచారం మేరకు కొరటాల శివ రీసెంట్ గా మహేష్ బాబుని కలిసి తన తాజా కథని వినిపించటం జరిగింది. అందులో ఓ కీలకమైన పాత్రను పోషించటానికి ఛరిష్మా ఉన్న నటుడు అవసరం. మొదట పవన్ ని ఈ పాత్రకు అనుకున్నారు కానీ చిరు సూచనపై మహేష్ ని సీన్ లోకి తీసుకుని వస్తున్నట్లు సమాచారం. ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, ఇంటర్వెల్ అయ్యాక, వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో మహేష్ కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంతసేపు కనపడతాడు,అందుకు ఎన్ని రోజులు డేట్స్ ఇవ్వాలి..ఏ టైమ్ లో అనే విషయం చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

కొరటాల శివ, మహేష్ బాబు మధ్య మంచి స్నేహం ఉంది. మహేష్ కెరీర్ లో రెండు బ్లాక్ బస్టర్స్..శ్రీమంతుడు, భరత్ అనే నేను ఇచ్చింది కొరటాల. అలాగే చిరంజీవి అంటే మహేష్ కు మంచి గౌరవం ఉంది. దాంతో మహేష్ మరో మాట ఆలోచించకుండా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ విషయమై అఫషియల్ కన్పర్మేషన్ రావాల్సి ఉంది.