Asianet News TeluguAsianet News Telugu

'ఆచార్య'లో మహేష్ క్యారక్టర్.. వింటేనే రోమాంచితం!

అందుతున్న సమాచారం మేరకు ..ఈ సినిమాలో మహేష్ ఓ కీలక ఎపిసోడ్‌లో కనిపించనున్నాడు.మొదట నక్సలైట్ పాత్రగా అనుకున్న దాన్ని ... అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్‌ గా మార్చారు. 

Mahesh Babu as a student leader in Acharya
Author
Hyderabad, First Published Feb 27, 2020, 9:27 AM IST

చిరంజీవి 152 వ చిత్రంలో మహేష్ నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ వంటి సూపర్ స్టార్ ని సినిమాలో తీసుకు వస్తే ఆ పాత్ర ఎలా ఉండాలి. ఏ స్దాయిలో ఉండాలి...అని ఫ్యాన్స్ అంచనాలు వేయటం మొదలెడతారు. ప్రేక్షకుల పల్స్ ని ఇట్టే పట్టేసిన దర్శకుడు కొరటాల శివ కు ఈ విషయాలన్ని తెలుసు. అందుకే..మహేష్ క్యారక్టర్ ని నెవ్వర్ బిఫోర్..నెవ్వర్ ఆఫ్టర్ అన్నట్లు మలిచాడని సమాచారం.

అందుతున్న సమాచారం మేరకు ..ఈ సినిమాలో మహేష్ ఓ కీలక ఎపిసోడ్‌లో కనిపించనున్నాడు.మొదట నక్సలైట్ పాత్రగా అనుకున్న దాన్ని ... అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్‌ గా మార్చారు. ఈ పాత్రలో మహేష్‌ను సరికొత్తగా చూపించనున్నారు కొరటాల. ఇందుకోసం మహేష్ 25 రోజులపాటు డేట్స్ కేటాయించినట్లి సమాచారం.. దాదాపు రూ.40 కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట నిర్మాతలు.. ఇక మహేష్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది.. మే నుంచి సూపర్ స్టార్ షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు.

హీట్ పెంచేలా నమిత సెక్సీ ఫోజులు.. ఫొటోస్

దేవాదాయ శాఖ‌లో జ‌రిగే అవినీతి అక్ర‌మాల‌పై సినిమా ఉంటుంద‌ని, న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది. చిరు సరసన త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుందని సమాచారం. ‘ఆచార్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఇక మొదట ఈ పాత్రను రామ్ చరణ్  తో అనుకున్నారు. ఇందుకోసం 45రోజుల క్యాల్షీట్లు కూడా ఇచ్చారని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజిగా ఉన్న  ఈ సమయంలో డేట్స్ ఎడ్జెస్ట్ చేయటం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. దాంతో రామ్ చరణ్ కు అనుకున్న పాత్రను మహేష్ కు ఇవ్వటంతో కొరటాల మొత్తం వెర్షన్ మార్చుకుంటూ వచ్చారట.
 

Follow Us:
Download App:
  • android
  • ios