రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో ఊహించని డిజాస్టర్ ఎదుర్కోవడంతో నెక్స్ట్ ఎలాగైనా మరో హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ సినిమా తో ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్ లో మెరవనున్నాడు. అయితే ఆ సినిమా అయిపోయిన తరువాత వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయాలనీ ప్రభాస్ కొత్త కథలను వింటున్నాడు.

అయితే ఎవరు ఊహించని విధంగా రెబల్ స్టార్ మహానటి దర్శకుడితో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక కథను రెడీ  చేసుకున్న నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ లోనే పెద్ద స్టార్స్ తో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రూమర్ పై ఎవరికీ అంతగా నమ్మకం కలగడం లేదు. ఎందుకంటె నాగ్ అశ్విన్ ఇంతవరకు ఫుల్ కమర్షియల్ యాంగిల్ ని టచ్ చేయలేదు.

మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం ఆ తరువాత సావిత్రి బయోపిక్ మహానటి సినిమాలు డిఫరెంట్ జనర్స్ కి చెందినవి. దీంతో ఈ కుర్ర దర్శకుడితో ప్రభాస్ నిజగా నెక్స్ట్ సినిమా చేస్తాడా అనేది అనుమానంగా ఉంది. అది  కూడా పాన్ ఇండియన్ మూవీ అంటే నమ్మబుద్ది కావడం లేదు. మరీ ఈ పుకార్లు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.