బాలీవుడ్ నటి మాన్వి గాగ్రూ ఆడిషన్స్ కోసం వెళ్లినప్పుడు తాను ఎదుర్కొన్న ఓ సంఘటన గురించి వెల్లడించింది. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటించిన 'ఉజ్డా చమన్' అనే సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మాన్వి. ఇందులో ఆమె బరువు ఎక్కువ ఉన్న అమ్మాయిగా కనిపించింది.

బట్టతల ఉన్న హీరోని ఇష్టపడే అమ్మాయిగా మాన్వి చక్కటి ప్రదర్శన కనబరిచారు. ఈ సినిమాతో దర్శకుడు అభిషేక్ పాథక్ సామాజిక సందేశాన్ని అందించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాన్వి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఓ ఆడిషన్స్ లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

సింగర్ కోసం న్యూడ్ ఫోటోలు షేర్ చేసిన నటి!

గతంలో సినిమా అవకాశం కోసం ఆడిషన్స్ కి వెళ్లినట్లు చెప్పిన మాన్వి.. చెత్తగా ఉన్న ఆ ఆఫీస్ లో తనను రేప్ సీన్ లో నటించమని అడిగినట్లు గుర్తు చేసుకుంది. అక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారని.. అక్కడి వాతావరణం చూసి భయంతో పరుగులు తీసుకుంటూ వచ్చేశానని వెల్లడించింది.

ఆ గదిలో ఓ బెడ్ కూడా ఉందని.. దాన్ని వాళ్లు ఆఫీస్ అని చెప్పుకోవడం విచిత్రంగా ఉందని తెలిపింది. ఈ బ్యూటీ టీవీ షో 'ధూమ్ మచావో ధూమ్' తో తన కెరీర్ మొదలుపెట్టారు. 'ట్రిప్లింగ్', 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' వంటి వెబ్ సిరీస్ లలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'శుభ్ మంగళ్ జ్యాదా సావ్ ధాన్' అనే సినిమాలో నటిస్తోంది.