కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాదాపుగా అన్ని ప్రధాన దేశాల్లో జన జీవనం స్తంభించిపోయింది. ఇండియాలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. సామాన్య జనం, సెలెబ్రిటీలు, క్రీడా ప్రముఖులు అని తేడా లేకుండా అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. 

దీనితో సెలెబ్రిటీలు ఒక్కొక్కరూ ఒక్కోలా ఇళ్లలో టైం పాస్ చేస్తున్నారు. కొందరు కసరత్తులు చేస్తూ ఫిజిక్ పై దృష్టి పెడుతున్నారు. మరికొందరు వంటలు చేస్తున్నారు. త్రిష మాత్రం ఇంట్లోనే ఉంటూ లాక్ డౌన్ పీరియడ్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా త్రిష ఇంట్లోనే డాన్సులు చేస్తూ టిక్ టాక్ వీడియోలు చేస్తోంది. 

బ్లాక్ షార్ట్, పర్పుల్ కలర్ టాప్, గాగుల్స్ ధరించి త్రిష చేసిన హాట్ డాన్స్ అభిమానులని ఫిదా చేస్తోంది. త్రిష సౌత్ లో దాదాపుగా అందరు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. ఇప్పటికి త్రిష మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Trisha on TikTok 😍🥰🤗 #trishakrishnan #trishaafp

A post shared by Trisha Krishnan 💖 (@trishaa.fp) on Apr 2, 2020 at 2:29am PDT

ఇటీవల త్రిష ఓ బంపర్ ఆఫర్ ని వదిలేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్యలో మొదటగా త్రిషనే హీరోయిన్ గా ఎంపిక చేశారు. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల తాను ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష ఇటీవల ప్రకటించింది.