మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడే ఈ వైష్ణవ్. వైష్ణవ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఉప్పెన. తన డెబ్యూ చిత్రంలోనే వైష్ణవ్ క్రేజీ టీంతో వర్క్ చేసే అదృష్టాన్ని దక్కించుకున్నాడు. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రానికి కథ కూడా సుకుమార్ అందిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. ఇదివరకే ఉప్పెన చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. కానీ అందులో వైష్ణవ్ తేజ్ ముఖాన్ని చూపించలేదు. చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు. అందులోను అదే పరిస్థితి. 

సముద్రపు అలల మధ్య నిలబడి వైష్ణవ్ గట్టిగా బేబమ్మా అంటూ అరుస్తున్న టీజర్ ఆకట్టుకుంది. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టిల పూర్తి లుక్ ని రివీల్ చేశారు. ముఖాలు కనిపించేలా పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ 'ఆసి' అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇక హీరోయిన్ కృతి శెట్టి పాత్ర పేరు సంగీత.  

సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న సంగతి తెలిసిందే. 

అక్కాచెల్లిళ్ల రచ్చ మామూలుగా లేదుగా.. క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన చిరుత పిల్ల