Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ కి బాబులా ఉన్నాడు.. ఒక్క సినిమాకు 100కోట్లా?

రజినీకాంత్ - కమల్ హాసన్ మార్కెట్ తగ్గుతున్న తరుణంలో ఆ నేటితరం హీరోలు ఊహించని విధంగా మార్కెట్ పెంచుకుంటున్నారు. కమర్షియల్ సినిమాలతో మార్కెట్ తో పాటు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో పేరు గట్టిగా వినిపిస్తోంది. అతడే ఇలయథలపతి విజయ్.

kollywood star hero vijay remuneration hot topic in media
Author
Hyderabad, First Published Feb 21, 2020, 12:11 PM IST

కోలీవుడ్ లో రజినీకాంత్ - కమల్ హాసన్ మార్కెట్ తగ్గుతున్న తరుణంలో ఆ నేటితరం హీరోలు ఊహించని విధంగా మార్కెట్ పెంచుకుంటున్నారు. కమర్షియల్ సినిమాలతో మార్కెట్ తో పాటు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో పేరు గట్టిగా వినిపిస్తోంది. అతడే ఇలయథలపతి విజయ్.

kollywood star hero vijay remuneration hot topic in media

మెర్శల్ సినిమా నుంచి విజయ్ చేస్తున్న ప్రతి సినిమా సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. సర్కార్ - బిగిల్ తో ఆ డోస్ ఇంకాస్త పెరిగింది. తమిళనాడులో విజయ్ సినిమా ఈజీగా 100కోట్ల వసూళ్లను అందుకుంటోంది. హిట్, ప్లాప్ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ఒక రేంజ్ లో అందుతున్నాయి. కేరళలో ఇప్పటికే స్ట్రాంగ్ మార్కెట్ ఏర్పడింది.

ఇక తెలుగులో కూడా మెల్లమెల్లగా తన రేంజ్ పెంచుకుంటున్నాడు. అయితే విజయ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న మాస్టర్ సినిమాతో 100కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. అంటే తమిళ్ నాడులో మొత్తం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విజయ్ తీసుకున్నాడట. ఇక మిగతా డిజిటల్ ఓవర్సీస్ రైట్స్ మొత్తం నిర్మాతలకు వదిలేశాడట.

kollywood star hero vijay remuneration hot topic in media

లాభాలు ఎక్కువగా అందితే కొన్ని షేర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కల ఒక సినిమాను 50 నుంచి 60కోట్లతో తో నిర్మించిన ప్రొడ్యూసర్స్ కి 15 నుంచి 20కోట్ల లాభాలు మాత్రమే వస్తాయన్నమాట. ఏదేమైనా విజయ్ తన మార్కెట్ కి తగ్గట్టుగా మంచిగా లాభాలను అందుకుంటున్నాడు. బాలీవుడ్ హీరోలు కూడా సినిమా మార్కెట్ కి తగ్గట్టు ఇదే ఫార్ములాను ఉపయోస్తుంటారు. కానీ వాళ్ళు ప్రతిసారి విజయ్ రేంజ్ లో సక్సెస్ అందుకోవడం లేదు. విజయ్ సక్సెస్ లను చూసి ఇటీవల ఐటి అధికారులు షూటింగ్ లోనే విచారించిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios