హాట్ బ్యూటీగ ముద్ర వేసుకున్న కిమ్ కర్దాషియన్ హాలీవుడ్ లో ఓ సంచలనం. తన ఘాటు సొగసుతో కుర్రకారుని తనవైపు తిప్పుకుంది. ఈ 39 ఏళ్ల భామకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తరచుగా సోషల్ మీడియాలో కిమ్ బికినీ ఫొటోలతో హల్ చల్ చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. 

కిమ్ కర్దాషియన్ ని ఇన్స్టాగ్రామ్ లో 151 మిలియన్ల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సెలెబ్రిటీలలో కిమ్ టాప్ 5 లో ఉంది.  సోషల్ మీడియాలో పోస్ట్ లకు గాను కిమ్ కర్దాషియన్ అత్యధిక పారితోషికం అందుకుంటోంది. 

బడా కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తులకు కిమ్ కర్దాషియన్ ద్వారా ప్రచారం కల్పించుకోవడం కోసం ఎగబడుతుంటారు. ఇటీవల తనకు, తన భర్తకు మధ్య జరిగిన ఆసక్తికర సంఘటనని కిమ్ వివరించింది. ఓ ప్రఖ్యాత షూ కంపెనీ తమ బ్రాండ్ కు కిమ్ ద్వారా ప్రచారం కల్పించాలని భావించింది. 

తన ఇన్స్టాగ్రామ్లో 151 మిలియన్ల ఫాలోవర్స్ ఉండడంతో కిమ్ ఎప్పటిలాగే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. అందుకు ఆ సంస్థ అంగీకరించింది కూడా. ఈ యాడ్ కోసం కిమ్ సైన్ చేయడానికి ముందు ఆమె భర్తకు డీల్ గురించి తెలిసింది. 

కిమ్ కర్దాషియన్ భర్త ప్రముఖ ర్యాపర్ కేన్ వెస్ట్. అతడికి కూడా ఓ షూ కంపెనీ ఉంది. కిమ్ కర్దాషియన్ ప్రచారం కల్పించబోతున్న సంస్థ కేన్ వెస్ట్ కు ప్రత్యర్థి కంపెనీ. ఆ సంస్థకు ప్రచారం కల్పించవద్దని కిమ్ కర్దాషియన్ ని వెస్ట్ రిక్వస్ట్ చేశాడు. నువ్వు కనుక ఇలా చేస్తే తన కంపెనీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాపోయాడట. 

దీనితో భర్తని అర్థం చేసుకున్న కిమ్ భారీ ఆఫర్ వదులుకుంది. ఆ సంస్థకు ప్రచారం కల్పించే ఆలోచన విరమించుకుంది. భార్య త్యాగానికి ఫిదా అయిన వెస్ట్ ఇక ఏమాత్రం ఆలోచించకుండా 1 మిలియన్ డాలర్(దాదాపు రూ.7 కోట్లు) చెక్ ని ఆమెకి ఇచ్చేశాడు. తనకు చెక్ ఇచ్చి తన భర్త సర్ ప్రైజ్ చేశాడని కిమ్ కర్దాషియన్ మురిసిపోతోంది. 

కిమ్ కర్దాషియన్, వెస్ట్ 2014లో వివాహం చేసుకున్నారు. కిమ్ కు ఇది మూడో వివాహం. అంతకు ముందు కిమ్ క్రిస్ హ్యూమ్ప్రేస్, డామన్ థామస్ లని వివాహం చేసుకుని వారి నుంచి విడిపోయింది.