ఏదో విభిన్నత లేకపోతే ప్రేక్షకుడు కనెక్ట్ కావటం లేదు. ముఖ్యంగా డిజిటల్ మీడియాలో అది మరీ అత్యవసరంగా మారింది. పనిగట్టుకుని కొన్ని గంటలు వెబ్ సీరిస్ లు చూస్తూ గడపాలంటే అంతకు తగ్గ కంటెంట్ ఉండాలి. నెట్ ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు అలాంటి ప్రాజెక్టులతో ముందుకు వస్తోంది. తాజాగా కియారా ప్రధాన పాత్రలో గిల్టీ అనే వెబ్ సీరిస్ రెడీ చేసింది. తాజాగా ఈ సీరిస్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది. అయితే ఈ ట్రైలర్ లోనే ఓ ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించి,ఆకట్టుకునేలా చేసింది.

ఈ సీరిసస్ లో కియరా ఓ కాలేజ్ అమ్మాయిగా కనిపించనుంది. తన ప్రెండ్స్ తో కలిసి జాలీగా గడిపుతూండగా... ఓ రోజు రాత్రి కియరా స్నేహితుల్లో ఒకరు రేప్ కి గురవుతారు. అయితే ఇక్కడే ట్విస్ట్... అతడిని రేప్ చేసింది ఒక అమ్మాయి! అని తేలుతుంది. దీంతో అసలు ఎవరు..ఎవరిని అత్యాచారం చేసారు..ఓ అబ్బాయిని...అమ్మాయి రేప్ చేసిందా అంటూ సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. మీరు ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

మహేష్ తో చేసిన ‘భరత్‌ అనే నేను’, రామ్ చరణ్ తో చేసిన  ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన కియారా అద్వానీని తెలుగువాళ్లకు బాగానే గుర్తుండి ఉంటుంది. కేవలం సౌత్ లోనే కాక, బాలీవుడ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న కియారా గత ఏడాది నెట్ ప్లిక్స్ వారి ‘లస్ట్‌ స్టోరీస్‌’లో నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు ‘గిల్టీ’ అనే ఈ వెబ్‌ ఫిల్మ్‌ చేస్తోంది.

ఈ వెబ్ సీరిస్ కు రుచి నరైన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సిటీకి కొత్తగా వచ్చిన ఓ పల్లెటూరి అమ్మాయికి కాలేజీలో ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఈ వెబ్‌ ఫిల్మ్‌ తెరకెక్కుతోంది.