తమిళ విలక్షణ నటుడు సూర్య సోదరుడిగా కార్తీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. కార్తీకి ఆవారా, నా పేరు శివ, ఊపిరి లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. తక్కువ సమయంలోనే కార్తీ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా కార్తీ 'ఖైదీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

ఖైదీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ గా నిలిచింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఉండగానే కార్తీ అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన తదుపరి చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. 

కార్తీ కొత్త సినిమా టైటిల్ 'దొంగ'గా ఖరారు చేశారు. దృశ్యం లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరక్కించిన జీతూ జోసెఫ్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో కార్తీతో పాటు అతడి వదిన జ్యోతిక కీలక పాత్రలో నటిస్తోంది. 

ఫస్ట్ లుక్ పోస్టర్ లో కార్తీ ఒకవైపు, జ్యోతిక మరోవైపు సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. మరి కార్తీ, జ్యోతికలలో ఎవరు దొంగ అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. 

డిసెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సూరజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత సంగీత దర్శకుడు. వివాహం తర్వాత సినిమాలు తగ్గించిన జ్యోతిక ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.