టాలీవుడ్ లో నార్త్ హీరోయిన్ల హవా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గ్లామర్ రోల్స్ కోసం దర్శక నిర్మాతలు నార్త్ హీరోయిన్లని ఎంపిక చేసుకుంటుంటారు. ఇప్పుడు క్రమంగా పరిస్థితిమారుతోంది. సౌత్ హీరోయిన్లు ప్రాంతీయ భాషా చిత్రాల్లో రాణిస్తున్నారు. మలయాళీ, కన్నడ ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా ఎక్కువగా అవకాశాలు అందుకుంటున్నారు. 

నివేత థామస్, సాయి పల్లవి, అనుమప పరమేశ్వరన్, నిత్యామీనన్ ఆ కోవకు చెందిన నటీమణులే. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఓ హీరోయిన్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రచిత రామ్ పేరు ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది. హోమ్లీ లుక్ లో మాయచేసి ఈ బ్యూటీ కోసం టాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు. 

తాజా సమాచారం మేరకు రచిత రామ్ మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ దేవ్ విజేత చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ నటిస్తున్న రెండవ చిత్రం 'సూపర్ మచ్చి'. 

ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ సరసన రచిత రామ్ హీరోయిన్ గా ఎంపికైందట. త్వరలో ఈ చిత్ర షూటింగ్ లో రచిత రామ్ పాల్గొనబోతోందట. రొమాంటిక్ ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కనుంది. పులి వాసు దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. 

ఇదిలా ఉండగా రచిత రామ్ కు బోయపాటి దర్శత్వం వహించే బాలయ్య 106వ చిత్రంలో ఛాన్స్ వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.