బాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి కంగనా రనౌత్. స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లపై హాట్ కామెంట్స్ చేస్తూ ఎప్పటి కప్పుడూ వార్తల్లో నిలుస్తుంది  ఈ బ్యూటీ. కంగనా కన్నా ఎక్కువగా ఆమె చెల్లెలు రంగోలి మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బాలీవుడ్‌ ను షేక్‌ చేస్తోంది. తాజాగా ఈ భామ తాజ్‌మహల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజ్‌ మహల్‌ అనేది కేవలం ఓ సమాధి మాత్రమే. అది ప్రేమకు చిహ్నం అనటం కరెక్ట్ కాదంటూ రంగోలీ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా ఆమె `తాజ్‌ మహల్‌ ను చాలా మంది సమాధిగానే భావిస్తారు. దాన్ని ప్రపంచ వింతగా చూడాలని ప్రజలను ఒత్తిడి చేస్తున్నారు` అంటూ ఆమె ట్వీట్ చేశారు. కేవలం తాజ్‌ గురించి మాత్రమే కాదు ముంతాజ్‌ గురించి కూడా ఆమె స్పందించారు. అంతా ముంతాజ్‌ మీద ప్రేమతోనే షాజహాన్‌ తాజ్‌ను కట్టించారని భావిస్తున్నారు. కానీ దీనికి వెనుక ఒళ్లు గగుర్పొడిచే విశేషాలు ఎన్నో ఉన్నాయని రంగోలి ట్వీట్ చేసింది. ఆమెను షాజహాన్‌ ఎంతో హింసిచేవాడని చెప్పారు రంగోలి.

అయితే రంగోలి చేసిన ట్వీట్ పై నెటిజెన్లు కూడా అదే స్థాయిలో స్పందించారు. తాజ్‌ మహల్‌ను ప్రేమకు చిహ్నంగా అంగీకరించాలని నిన్ను ఎవరూ అడగటం లేదని ఆమె ఆమెకు రిప్లై ఇచ్చారు. మరికొందరు మీ అభిప్రాయం మాకు అవసరం లేదు, ఇది ప్రపంచలోని వింత అని చరిత్ర చెబుతుంటే నీ అభిప్రాయం ఎవరికి కావాలి అంటూ ఫైర్‌ అవుతున్నారు నెటిజెన్లు. రంగోలి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తొలిసారి కాదు. గతంలోనూ కంగనాను సపోర్ట్ చేస్తూ రంగోలి చేసిన ట్వీట్లు చాలా సార్లు వివాదాస్పద మయ్యాయి.