Asianet News TeluguAsianet News Telugu

అలాంటి వాళ్లతో చేతులు కలపను.. దీపికపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!

తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జేఎన్‌యూలో దీపికా పర్యటించడంపై స్పందించారు. ఎక్కడికైనా వెళ్లగలిగే స్వేచ్చ ఆమెకి ఉందని.. కానీ తను మాత్రం తుక్డే గ్యాంగ్ వెనుక నిల్చునే ప్రసక్తే లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

Kangana Ranaut Reacts To Deepika Padukones JNU Visit
Author
Hyderabad, First Published Jan 17, 2020, 4:05 PM IST

జేఎన్‌యూ విద్యార్ధులను పరామర్శించడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ యూనివర్సిటీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఆమెని విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఘటన జరిగి పదిరోజులు కావొస్తున్నా.. ఆమెపై కామెంట్లు మాత్రం తగ్గడం లేదు.

కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు దీపికపై విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జేఎన్‌యూలో దీపికా పర్యటించడంపై స్పందించారు. ఎక్కడికైనా వెళ్లగలిగే స్వేచ్చ ఆమెకి ఉందని.. కానీ తను మాత్రం తుక్డే గ్యాంగ్ వెనుక నిల్చునే ప్రసక్తే లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఇంతగా దిగజారాలా..? స్టార్ హీరోయిన్ ని 'ఛీ' కొడుతున్న నెటిజన్లు

కంగనా ప్రధాన పాత్రలో నటించిన 'పంగా' సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శుక్రవారం నాడు ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జేఎన్‌యూలో జరిగిన హింసలో గాయపడ్డ వారిని పరామర్శించడానికి దీపిక వెళ్లిన అంశంపై కంగనా స్పందించారు.

దీపిక ఏం చేసిందో.. ఏం చేయబోతుందనే విషయాలపై మాట్లాడలేనని.. ఏమైనా చేయగల హక్కు అమెకుందని.. కానీ తను మాత్రం దేశాన్ని విచ్చిన్నం చేయాలని ప్రయత్నించే దేశద్రోహులకు మద్దతు తెలపనని చెప్పింది.

జవాన్లు మరణిస్తే.. సంబరాలు చేసుకునే వారితో చేతులు కలపనని.. దేశానికి వ్యతిరేకంగా కుట్రపన్నే తుక్డే గ్యాంగ్ వెనుక నిల్చోనని చెప్పారు.  

Follow Us:
Download App:
  • android
  • ios