కోలీవుడ్ లో అమలాపాల్ నటించిన 'ఆడై' చిత్రాన్ని తెలుగులో 'ఆమె'గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అమలాపాల్ ఏ హీరోయిన్ చేయని ధైర్యం చేసి న్యూడ్ గా నటించింది. సినిమాలో దాదాపు గంట పాటు ఆమె న్యూడ్ గా కనిపిస్తుంది.

నగ్నంగా చూపించకుండా కవర్ చేసింప్పటికీ.. ప్రేక్షకులకు మాత్రం ఆమె నగ్నంగా ఉన్న భావన కలిగించారు. సినిమా షూటింగ్ సమయంలో అతికొద్ది మంది టెక్నీషియన్ల మధ్య నగ్నంగా ఉన్నట్లు అమలా గతంలో వెల్లడించింది. ఒక సౌత్ హీరోయిన్ ఇలాంటి పాత్ర చేయడం సంచలనమైంది. అమలాపాల్ అంత కష్టపడి సినిమాలో నటించినప్పటికీ ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.

''ఆరడుగుల కటౌట్.. అభిమానుల సాహో'' ప్రభాస్ రేర్ పిక్స్..!

కాన్సెప్ట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. థ్రిల్లర్ సినిమాలు, రొమాంటిక్ సినిమాలు తీయడంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విక్రమ్ భట్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇటువంటి సాహసోపేతమైన పాత్రల్లో నటించడానికి హిందీలో చాలా మంది హీరోయిన్లు సిద్ధంగా ఉంటారు.

 

అయితే బోల్డ్ గా నటించడమే కాదు.. నటన కూడా సినిమాకి కీలకం కాబట్టి హీరోయిన్ గా కంగనా రనౌత్ ని తీసుకోవాలని విక్రమ్ భావిస్తున్నాడట. ఆమెకి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు.

సాధారణంగా కంగనా తన సినిమాల విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటుంది. మేకింగ్ విషయంలో కూడా జోక్యం చేసుకుంటుంది. మరి విక్రమ్ లాంటి సీనియర్ డైరెక్టర్ ఆమెతో అడ్జస్ట్ అవ్వగలడా అనేది అనుమానమే.. మరి కంగనా ఈ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!