సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తన స్తాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు. అయితే సినిమాలు సక్సెస్ కాకపోయినా ఆ సినిమాల ప్రమోషన్ కోసం వర్మ చేసే ఫీట్లు మాత్రం ఓ రేంజ్‌ లో కాంట్రవర్సీలను సృష్టిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను టార్గెట్ చేస్తూ వర్మ తెరకెక్కించిన సినిమాలు ఎన్నో వివాదాలకు కేంద్ర బింధులుగా మారాయి. ఈ వివాదంలో రచయిత జొన్న విత్తుల కూడా తలదూర్చాడు.

కమ్మరాజ్యంలో కడప రెడ్లు పేరుతో వర్మ సినిమా ఎనౌన్స్ చేయటం కాంట్రవర్సీగా మారింది. కుల ప్రస్థావనతో సినిమాను రూపొందించటంపై రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు వర్మపై పలు టీవీ చర్చా కార్యక్రమాల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వర్మ కూడా అదే స్థాయిలో స్పందించాడు. జొన్నవిత్తులు టీజ్ చేస్తూ కామెంట్స్ చేశాడు. వర్మ కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించిన జొన్నవిత్తుల వర్మ బయోపిక్‌ను తీస్తా అంటూ ప్రకటించాడు.

అన్నట్టుగానే వర్మ బయోపిక్‌ను ప్రకటించాడు జొన్నవిత్తుల. తాజాగా జొన్నవిత్తులాస్‌ ఆర్జీవి (రోజూ గిల్లే వాడు) అంటే ఓ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయనే స్వయంగా నిర్మాతగా మారి ఈ బయోపిక్ ను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోయే వ్యక్తి అచ్చు వర్మను పోలి ఉంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో షూటింగ్ లు ఆగిపోయాని, తిరిగి షూటింగ్‌లు ప్రారంభమైన వెంటనే వర్మ బయోపిక్‌ను పట్టాలెక్కించాలని భావిస్తున్నారు.