సినీ తారల మధ్య ప్రేమలు, వివాహాలు, బ్రేకప్ లకు సంబంధించిన వార్తలు చూస్తూనే వింటూనే ఉన్నాం. సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలు సంచలనం సృష్టిస్తుంటాయి. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రపంచంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటుల్లో హాలీవుడ్ క్రేజీ హీరో జానీ డెప్ ఒకరు. 

ప్రపంచ ప్రఖ్యాత డిస్ని సంస్థ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' సిరీస్ ద్వారా జానీ డెప్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. అనేక వివాదాల కారణంగా జానీ డెప్ తో డిస్ని సంస్థ కాంట్రాక్టు రద్దు చేసుకుంది. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ నుంచి అతడిని తొలగించింది. అప్పటి నుంచి జానీ డెప్ వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు మొదలయ్యాయి. 

2015లో జానీ డెప్ అందాల తార అంబర్ హార్డ్ ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 23 ఏళ్ల వ్యత్యాసం ఉంది. జానీ డెప్ కన్నా అంబర్ హార్డ్ 23 ఏళ్ళు వయసులో చిన్న. అయినా కూడానా ప్రేమించి వివాహం చేసుకుంది. రెండేళ్లకే వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కోర్టు మెట్లెక్కారు. జానీ తనని హింసించాడు అంటూ అంబర్ కేసు నమోదు చేయగా.. ఆమె కూడా తనని టార్చర్ పెట్టిందని జానీ కేసు పెట్టాడు. 

ఇటీవల ఈ కేసు కోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా జానీ డెప్ ఫోన్ నుంచి సంచలన మెసేజ్ లు లీక్ అయ్యాయి. జానీ డెప్ అంబర్ హార్డ్ ని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఆ మెసేజ్ లలో ఉంది. ఈ మెసేజ్ లని జానీ తన ఫ్రెండ్ కు పంపాడు. 

'అంబర్ ని చంపేద్దాం.. మొదట నీళ్లలో ముంచుదాం.. ఆ తర్వాత తగలబెట్టేద్దాం' అని జానీ డెప్ తన స్నేహితుడు పాల్ కు మెసేజ్ చేశాడు. మరో మెసేజ్ లో నా భార్య అసహ్యమైనది. ఇంట్లో నాకు తిండి కూడా లేదు అని ఉంది. ఈ మెసేజ్ లని చదివిన జడ్జి షాకయ్యారు. 

చీరకట్టులో అనసూయ వయ్యారాలు.. నడుము అందంతో సెగలు రేపుతోంది

అంబర్,, జానీ డెప్ ని టార్చర్ చేసిందని.. ఆ భాదలోనే ఈ మెసేజ్ లు చేశాడని.. నిజంగా తనకు హత్య చేసే ఉద్దేశం లేదని అతడి తరుపున న్యాయవాది వాదించాడు. ఇదిలా ఉండగా గతంలో అంబర్ హార్డ్ ఆడియో కూడా లీక్ అయింది. జానీ డెప్ ను తాను రోజూ టార్చర్ పెడతానని.. మద్యం బాటిళ్లతో దాడి చేస్తానని ఆమె తన స్నేహితురాళ్ళతో చెప్పినట్లు ఉన్న వీడియో లీక్ అయింది. 

ఛాన్సుల్లేని హీరోయిన్లకు పడుకోవడమే మార్గమా.. హీరోయిన్ హాట్ కామెంట్స్

మొత్తంగా ఈ మాజీ కపుల్స్ మధ్య వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.