ప్రభాస్ నెక్స్ట్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్న విషయం తెలిసిందే. సాహో తరువాత చాలా తొందరగా మరో సినిమాతో వస్తానన్న ప్రభాస్ మళ్ళీ లెట్ చేసేలా కనిపిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి ఒక రూమర్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది.

అంతా అదే నిజమనుకున్నారు. కానీ ఇప్పుడు అందులో ఏ మాత్రం నిజం లేదని దర్శకుడు రాధాకృష్ణ ఇటీవల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఆ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందట మొదలైంది. ఇక ఇప్పుడు తదుపరి షెడ్యూల్ కోసం ప్రభాస్ సిద్దమవుతున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పనులు పూర్తి చేయాలనీ దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమా పీరియాడిక్ డ్రామా అని పూర్వ జన్మల నేపథ్యంలో కథ తెరకెక్కుతోందని టాక్ వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఈ సినిమా పూర్తిగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని అలాగే సినిమాలో పూజా హెగ్డే - ప్రభాస్ కి మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్ కి మంచి కిక్కిస్తుందని అన్నారు.

త్వరలో సినిమాకు సంబందించిన స్పెషల్ లుక్ ని అలాగే టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేయాలనీ ప్రభాస్ ఆలోచిస్తున్నట్లు టాక్.  ఇకపోతే ప్రస్తుతం పూర్తి నటీనటులను చిత్ర యూనిట్ సెలెక్ట్ చేసుకుంటోంది. సినిమాలో విలన్ రోల్ కోసం జగపతి బాబును ఫిక్స్ చేసినట్లు సమాచారం.   ప్రస్తుతం సౌత్ లో స్టార్ విలన్ గా అలాగే డిఫరెంట్ పాత్రలతో అలరిస్తున్న జగ్గూ భాయ్ ప్రభాస్ తో కూడా పోటీ పడేందుకు సిద్దమవుతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.