తూర్పు ఆసియా దేశాల్లో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చైనాలో మొదలైన ఈ వైరస్ అనేక దేశాలకు వ్యాపించింది. చైనాకు చుట్టుపక్కల దేశాల్లో కరోనా తీవ్రత కనిపిస్తూ ఉంది. ఈ వైరస్ గురించి వాస్తవాలు ఏమేరకు ప్రచారానికి నోచుకుంటున్నాయో కానీ.. రూమర్లు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో మార్షల్ ఆర్ట్స్ వీరుడు జాకీ చాన్ కి కరోనా సోకిందని ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ప్రచారం ఎలా మొదలైందో కానీ దీని కారణంగా జాకీ అభిమానులు ఎంతో నిరాశ చెందారు. దీంతో వాళ్లంతా సానుభూతి వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.

ఫ్రాన్స్ కి బయలుదేరిన ప్రభాస్.. అక్కడ వందల మందికి కరోనా!

అంతేకాదట.. జాకీ చాన్ కి మాస్క్ లు పంపారట కొంతమంది. మరికొందరు తొందరగా కోలుకోవాలంటూ సందేశాలు పంపిస్తున్నారట. ఈ నేపధ్యంలో జాకీ ఈ విషయంలో స్పందించారు. తనకు కరోనా వైరస్ సోకిందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

తనపై అందరూ చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెబుతూ.. తన కరోనా వైరస్ బారిన పడలేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి ప్రచారాలు చేయడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. అందుకే జాకీచాన్ ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.