దర్శకధీరుడు రాజమౌళి ఇకపై గ్యాప్ లేకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేయబోతున్నారా అంటే.. సినీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. బాహుబలి చిత్రంతో రాజమౌళి దేశం మొత్తం తన తదుపరి చిత్రం కోసం ఎదురుచూసేంత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్నతాజా చిత్రం ఆర్ఆర్ఆర్. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఇది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా రాజమౌళి తదుపరి చిత్రానికి కూడా ఇప్పుడే ప్రణాళికలు రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అలాంటి ఇలాంటి ప్లానింగ్ కాదు.. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లతో రాజమౌళి మల్టీస్టారర్ చిత్రానికి రూపొందించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టు కు నిర్మాతలు కూడా ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. 

చిరంజీవితో అనుబంధం.. నితిన్ అత్తామామల గురించి ఆసక్తికర విషయాలు !

సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ, యువీ క్రియేషన్స్ సంస్థ ఈ రాజమౌళి, మహేష్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కే చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే ఇంకా ఏడాది సమయం ఎదురుచూడాల్సిందే.. అంటే ఆర్ఆర్ఆర్ పూర్తయ్యే వరకు. 

బూతులు మొదలు పెట్టింది, మాట్లాడడం మానేశా.. శ్రీరెడ్డిపై మరో కేసు