ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా నితిన్, షాలిని అనే యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. వీరిద్దరూ చాలా సీక్రెట్ గా తమ ప్రేమని కొనసాగించారు. ఏప్రిల్ 16న నితిన్, షాలినిల వివాహం దుబాయ్ లో జరగనుంది. 

ఈ నేపథ్యంలో నితిన్ కు కాబోయే భార్య కుటుంబ వివరాల గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర సంగతులు వెలుగులోకి వస్తున్నాయి. నితిన్ అత్తా మామల పేర్లు సంపత్ కుమార్, నూర్ జహాన్. వీరిద్దరిదీ మతాంతర వివాహం. వీరి రెండవ కుమార్తె షాలిని. నితిన్, షాలిని ఉమ్మడి స్నేహితుల ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. 

షాలిని తల్లిదండ్రులు నాగర్ కర్నూల్ లో ప్రగతి నర్సింగ్ హోమ్స్ అనే ఆసుపత్రిని నడుపుతున్నారు. ఇద్దరూ డాక్టర్లే కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, సంపత్ కుమార్ కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో నూర్ జహాన్ ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. నాగర్ కర్నూల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అలా చిరు, నితిన్ అత్తామామల కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. 

క్లీవేజ్ అందాలతో ఇలియానా రచ్చ.. ఫొటోస్ చూశారా

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత సంపత్, నూర్ జహాన్ రాజకీయాలకు దూరమై తమ వృత్తిలో నిమగ్నమైపోయారు. తమ కుమార్తె ప్రేమకు అడ్డు చెప్పకుండా ఆమె మెచ్చిన నితిన్ తో వివాహం జరిపిస్తున్నారు. 

షాలినితో నితిన్ ప్రేమాయణం.. ఎందుకు లీక్ కాలేదంటే ?