తమిళ హీరో ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో నటిస్తున్నాడు. 'మాస్టర్' అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విజయ్ ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నాడు. మాళవిక మోహన్, ఆండ్రియా కథానాయికలు. 

మాస్టర్ చిత్ర షూటింగ్ లో ఉండగానే విజయ్ పై ఐటీ దాడులు జరిగాయి. దీనితో మాస్టర్ చిత్రంపై అభిమానుల్లో మరింతగా క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా చిత్ర యూనిట్ మాస్టర్ మూవీ నుంచి 'కుట్టి స్టోరీ' అంటూ సాగే స్వయంగా విజయ్ పాడిన పాటని రిలీజ్ చేశారు. 

సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ పాటని 'వై దిస్ కొలవెరి' తరహాలో స్వరపరిచారు. విజయ్ సరదాగా తన స్టూడెంట్స్ కోసం పడుతున్న ఈపాట ఆకట్టుకుంటోంది. అనురాజా కామరాజ్ ఈ పాటకు సాహిత్యం అందించాడు. 

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో వస్తున్న చిత్రం కావడంతో మాస్టర్ మూవీపై కనీ వినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. 

ఈ చిత్ర షూటింగ్ లో విజయ్ బిజీగా ఉన్న సమయంలో ఐటీ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. విజయ్, బిగిల్ ఫైనాన్సియర్ అన్బు చెళియన్ నివాసం నుంచి దాదాపు 70 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.