సినిమాల్లో కొన్ని సార్లు నగ్నంగా నటించాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఆ సమయంలో నో చెబితే ఎక్కడ సినిమా ఛాన్స్ పోతుందోననే భయంతో ఒప్పుకుంటారు. అయితే ఇండస్ట్రీకి వచ్చి ఓ స్థాయికి వచ్చిన తరువాత కూడా ఇలాంటి సీన్స్ లో నటించమంటే మాత్రం ఒప్పుకోరు.

తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని నగ్న సన్నివేశాల్లో నటించరు. పైగా ఈ మధ్యకాలంలో అలంటి నగ్న సన్నివేశాలను పోర్న్ సైట్లలో పెడుతున్నారు. ఇదే పరిస్థితి ప్రముఖ హాలీవుడ్ నటి కీరా నైట్లేకి ఎదురైందట. అందుకే ఇకపై అలాంటి సన్నివేశాల్లో నటించనని చెబుతోంది.

ఆమె వయసు ముప్పై ఏళ్లు.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటికీ దర్శకులు నగ్న సన్నివేశాల్లో నటించాలని అడుగుతుంటారట. అందుకే ఏదైనా సినిమాకి సంతకం చేసేముందు తన కాంట్రాక్ట్ లో 'నో న్యూడిటీ క్లాజ్' అని రాయించుకొని మరీ సంతకం తీసుకుంటుందట.

గతంలో నగ్న సన్నివేశాల్లో నటించానని.. కానీ ఇప్పుడు మాత్రం నటించలేనని చెప్పారు. అలాంటి సన్నివేశాల్లో నటిస్తే వాటిని పోర్న్ సైట్స్‌లో పెట్టేస్తున్నారని... దాంతో నన్ను పోర్న్‌స్టార్ అనుకునే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. ఒకవేళ కచ్చితంగా నటించాల్సివస్తే డూప్ చేత చేయిస్తానని.. ఆ సీన్లను దగ్గరుండి ఎడిటింగ్ చేయించుకుంటానని చెప్పింది.