ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో బూతులు, సెక్స్ సీన్లు పెడుతూ అదే బోల్డ్ అనే ఫీల్ అవుతూ జనాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. యంగ్ హీరో విశ్వక్ సేన్ గతంలో తెరకెక్కించిన 'ఫలక్ నుమా దాస్'లో విచ్చలవిడిగా బూతులు వాడారు.

ఎద అందాలను ఎరగా వేస్తూ.. అదాశర్మ ఫోటోలు వైరల్!

తన తాజా చిత్రం 'హిట్' లో కూడా ఆ ఛాయలు కనిపించాయి. అలా బూతులు పెట్టడం అప్డేట్ అవ్వడమేనని అంటున్నారు విశ్వక్ సేన్. ''అప్ డేట్ అవ్వడం అంటే ఇదే. మేం బోల్డ్ ఫిలిం మేకర్స్ గా మారాం. ఇక నా విషయానికొస్తే నేను హద్దులు పెట్టుకోను. ఓ బూతు పెడితే ఆడియన్స్ రారేమో అని అనుకోను. ప్రతి సినిమాలో అన్ని హ్యూమన్ ఎమోషన్స్ ఉండాలి. నా సినిమాలో కూడా అలాంటి ఎమోషన్స్ ఉండాలనుకుంటాను. అందులో భాగంగా బూతు వస్తుంది తప్ప, కావాలని నేను బూతు ఎందుకు పెడతాను'' అంటూ చెప్పుకొచ్చాడు.

అంతేకాదు.. ఆ సిట్యుయేషన్ లో బూతు మాట్లాడాలి కాబట్టి బూతు వచ్చిందని.. కావాలని మాత్రం పెట్టుకోలేదని అన్నారు. మరీ ముఖ్యంగా హిట్ సినిమా స్క్రిప్ట్ తను రాయాలేదని.. డైరెక్ట్ చేయలేదని.. కేవలం దర్శకుడు చెప్పినట్లు మాత్రమే పని చేశానని అన్నారు. ఇలా హిట్ సినిమాలో బూతులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు విశ్వక్ సేన్.