ఇప్పుడంటే ఎక్కువగా యువత ప్రేమ వివాహాలపై మొగ్గు చూపుతున్నారు. కానీ రెండు మూడు దశాబ్దాల క్రితం ప్రేమ వివాహాలు తక్కువ. పెద్దలు కుదిర్చిన వివాహాలే ఉండేవి. యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన ప్రేయసి షాలినితో పెళ్ళికి సిద్ధం అవుతున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈజంట పెద్దల అంగీకారంతో పెళ్ళికి రెడీ అయ్యారు. 

ఫిబ్రవరి 15 శుక్రవారం రోజున నితిన్, షాలినిలకు నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 16న వైభవంగా ఈ జంట వివాహం జరగబోతోంది. ఈ నేపథ్యంలో నితిన్ ప్రేయసి షాలిని కుటుంబ వివరాలు తెలుసుకునేందుకు సినీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆమె తల్లి దండ్రుల గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

షాలిని యుకెలో ఎంబీఏ చదువుకున్నారు. కామన్ ఫ్రెండ్ ద్వారా నితిన్ తో పరిచయం ఏర్పడడం, అది కాస్త ప్రేమగా మారడం జరిగింది. వీరిద్దరి ప్రేమాయణం మొదలైన కొన్ని రోజులకే కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాకపోతే కెరీర్, ఇతర కారణాల వాళ్ళ పెళ్ళికి సమయం తీసుకున్నారు. 

చిరంజీవి, సురేఖ పెళ్లి చూపులు అలా జరిగాయి.. మెగాస్టార్ అహం దెబ్బతినిందట!

ఇక షాలిని తల్లిదండ్రులది కూడా ప్రేమ వివాహమే. షాలిని తండ్రి సంపత్ కుమార్ హిందువు. ఆయన డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నాడు. తల్లి పేరు నూర్ జహాన్. ఆమె ఒక ముస్లిం. ఆమె కూడా డాక్టరే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పుడే వీరిద్దరి వివాహం కుల మతాలకు అతీతంగా జరిగింది. అయితే వివాహం తర్వాత నూర్ జహాన్ హిందువుగా మారారట. 

బ్రహ్మచర్యానికి స్వస్తి.. హీరో నితిన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు!

నితిన్ అత్తా మామలు నాగర్ కర్నూల్ లో ప్రగతి నర్సింగ్ హోమ్ పేరిట ఓ ఆసుపత్రిని రన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ కుమార్తె ప్రేమకు వీరిద్దరూ ఎప్పుడూ అడ్డు చెప్పలేదట. వీరికి షాలిని రెండవ కుమార్తె.