Asianet News TeluguAsianet News Telugu

ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్.. భయపడిపోతున్న నితిన్

యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజయింది. అన్ని చోట్ల నుంచి భీష్మ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫిలిం క్రిటిక్స్ కూడా మంచి రివ్యూలు ఇస్తున్నారు.

hero nithiin feeling tension with Andhadhun remake
Author
Hyderabad, First Published Feb 21, 2020, 4:00 PM IST

యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజయింది. అన్ని చోట్ల నుంచి భీష్మ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫిలిం క్రిటిక్స్ కూడా మంచి రివ్యూలు ఇస్తున్నారు. ఈ శివరాత్రికి విడుదలైన భీష్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు మొదలు పెట్టారు. 

హ్యాట్రిక్ ఫ్లాపులకు అడ్డు కట్ట వేస్తూ నితిన్ భీష్మతో విజయాన్ని అందుకోవడం ఊరటనిచ్చే అంశం. అదే ఉత్సాహంతో  ఈ ఏడాది నితిన్ రెండు మూడు చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. అందులో ఒకటి హిందీలో ఘనవిజయం సాధించిన అంధాదున్. 

ఆయుష్మాన్ ఖురానా, టబు కీలక పాత్రల్లో నటించిన అంధాదున్ మూవీ క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఈ చిత్ర రీమేక్ హక్కులని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ చిత్ర రీమేక్ లో ఇతర హీరోలు నటించబోతున్నట్లు కొంతమంది పేర్లు వినిపించాయి. దీనిపై భీష్మ ప్రమోషన్స్ లో నితిన్ క్లారిటీ ఇస్తూ..  అంధాదున్ రీమేక్ లో తానే నటించబోతున్నానని, మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తాడని నితిన్ ప్రకటించాడు. 

సర్ ప్రైజ్.. రెండవసారి తల్లైన సాగర కన్య!

ఈ చిత్రంలో నటించనుండడం నితిన్ కు ఒకింత భయాన్ని కూడా కలిగిస్తోందట. రీమేక్ చిత్రాలు వచ్చిన ప్రతి సారి ఒరిజినల్ వర్షన్ తో పోల్చుతారు. పైగా అంధాదున్ చిత్రానికి గాను ఆయుష్మాన్ ఖురానా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అంశమే నితిన్ భయానికి కారణం. ఏది ఏమైనా అంధాదున్ రీమేక్ తన కెరీర్ లో ఓ వైవిధ్యమైన చిత్రంగా నిలుస్తుందని నితిన్ అంటున్నాడు. 

అలా చేస్తే అతడి తల నరుకుతా.. స్టార్ హీరోకి బెదిరింపులు

అంధాదున్ రీమేక్ తో పాటు.. వెంకీ అట్లూరి దర్శత్వంలో రంగ్ దే చిత్రం, చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో చెక్ చిత్రాల్లో నితిన్ ఈ ఏడాది నటించబోతున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios