Asianet News TeluguAsianet News Telugu

డబ్బు చాలా వచ్చేది కానీ.. ఆర్థిక పరిస్థితిపై గొల్లపూడి ఏమన్నారంటే?

నటుడు గొల్లపూడి ఆకస్మిక మరణం సినీ ఇండస్ట్రీలో అందరిని షాక్ కి గురి చేసింది. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి గురువారం చెన్నై ఆస్పత్రిలో చిక్కిత్స పొందుతూ మరణించారు. అయితే గత ఇంటర్వ్యూలో ఆయన తన ఆర్థిక పరిస్థితిపై ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేశారు. 

gollapudi maruthi rao shocking comments on previous interview
Author
Hyderabad, First Published Dec 12, 2019, 2:17 PM IST

సీనియర్ నటుడు గొల్లపూడి ఆకస్మిక మరణం సినీ ఇండస్ట్రీలో అందరిని షాక్ కి గురి చేసింది. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి గురువారం చెన్నై ఆస్పత్రిలో చిక్కిత్స పొందుతూ మరణించారు. అయితే గత ఇంటర్వ్యూలో ఆయన తన ఆర్థిక పరిస్థితిపై ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేశారు.

 గొల్లపూడికి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే తరహాలో సినిమా సినిమాకు రెమ్యునరేషన్ కూడా పెరుగుతూ వచ్చింది. అయితే పారితోషికం ఎంత వచ్చినా నేను పెద్దగా పట్టించుకునే వాన్ని కాదని గొల్లపూడి గత ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక 100నోట్లు ఉన్న కట్ట ఇస్తే ఖచ్చితంగా తప్పుగా లెక్క పెట్టేవాన్నని అన్నారు.

సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

ఇంకా ఏమన్నారంటే.. నేను మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ హానర్స్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ డబ్బు విషయంలో తప్పుగా లెక్కపెట్టేవాన్ని. అసలు డబ్బు సంపాదించాలన్న కాన్సెప్ట్ నాలో లేదు. ఎప్పుడు డబ్బు వెంబడి పడలేదు. 1959-60ల కాలంలో వంద రూపాయలు జీతం ఉన్నప్పుడు కథలు రాస్తే అంతకంటే ఎక్కువ వచ్చేది. డబ్బును హ్యాండిల్ చేయడం వంటి విషయాలను పట్టించుకోలేదు.

అయితే డబ్బు ఎప్పుడైనా నేను కావాలనుకున్నప్పుడు నాకు వచ్చేది. కానీ డబ్బు కోసం ఎప్పుడు కూడా నేను నా దారి తప్పలేదు. నా ఆలోచన కూడా మారలేదు,.నా భార్య ఇప్పటికి తిడుతూ ఉంటుంది. పెళ్లయినప్పుడు నాకు ఇంత డబ్బు ఇచ్చి ఉంటే ఖర్చు చేసేదేన్నని. ఈ 60 ఏళ్ల వయసులో నేను ఎలా ఖర్చు పెట్టను అని ఇప్పటికి ఆమె తిడుతు ఉంటుందని గొల్లపూడి గత ఇంటర్వ్యూలో చెప్పారు. ఎప్పుడు కూడా ఆర్థికపరంగా సమస్యలు రాలేదని అలాగని గొప్పగా సంపాదించాను అని కూడా నేను అనుకోనని వివరణ ఇచ్చారు

Follow Us:
Download App:
  • android
  • ios