తమిళనాడులో జయలలిత బయోపిక్ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికి జయలలిత జీవితంపై పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ప్రముఖ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో జయలలిత జీవితంలోని అంశాలతో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'క్వీన్' అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

అలాగే దర్శకుడు ఏఎల్ విజయ్ కూడా 'తలైవి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తోంది. ఈ రెండు బయోపిక్ చిత్రాలపై జయలలిత మేనకోడలు దీప జయకుమార్ కేసు నమోదు చేసింది. కోర్టు వాదనలు విన్న తర్వాత ఈ కేసుని డిస్మిస్ చేసింది. దీనితో జయలలిత బయోపిక్ చిత్రాలకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. తన అనుమతి తీసుకోకుండా జయలలిత బయోపిక్ చిత్రం తెరకెక్కిస్తున్నారనేది దీప ప్రధాన వాదన. 

నితిన్ 'భీష్మ' చిత్రానికి కష్టం.. కేటీఆర్ కు ఫిర్యాదు చేసిన డైరెక్టర్!

తాజాగా దీప మరోసారి జయలలిత బయోపిక్ చిత్రాల గురించి కామెంట్స్ చేసింది. అమ్మ జీవితాన్ని కించపరిచే విధంగా, ఆమె వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా చిత్రాలు రూపొందిస్తున్నారని దీప ఆరోపించింది. దీప ఆరోపణలపై దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఘాటుగా బదులిచ్చారు. 

పిచ్చెక్కిస్తున్న దిశా పటాని ఐటెం సాంగ్.. ప్రియుడి కోసం బికినీలో బోల్డ్ గా..

అసలు జయలలిత గురించి మాట్లాడే అర్హత దీపకు లేదు. జయలలిత బతికున్నప్పుడు దీప పట్టించుకుందా.. కనీసం ఆమెతో మాట్లాడడానికైనా వచ్చేదా అంటూ గౌతమ్ మీనన్ ప్రశ్నించారు. ఆమె బతికున్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మాత్రం హక్కుల కోసం వస్తోంది అంటూ గౌతమ్ మీనన్ ఎద్దేవా చేశారు. 

'దాన్ని కాల్చి చంపేద్దాం'.. మాజీ భార్యపై స్టార్ హీరో కుట్ర.. మెసేజ్ లీక్!