Asianet News TeluguAsianet News Telugu

‘డిస్కో రాజా’ ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియా వైజ్)!

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 19.50 కోట్లు జరిగింది. పబ్లిసిటీ, ప్రింట్లు ఖర్చులు కలుపుకుంటే కలుపుకుంటే మరో రెండు నుంచి మూడు కోట్లు అవుతాయి. 

Disco Raja Worldwide Pre Release Business
Author
Hyderabad, First Published Jan 22, 2020, 12:36 PM IST

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డిస్కో రాజా’. నభా నటేష్, పాయల్‌ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని రామ్‌ తాళ్లూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్లు, టీజర్‌, పాటలు సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ను అమాంతం పెంచేశాయి. ఇక జనవరి 24న విడుదల కాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ జారీ చేశారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ స్దాయిలో జరిగిందో ఓ లుక్కేద్దాం.

నిర్మాతలిచ్చిన చెక్కులు చించేశా.. హీరో రవితేజ కామెంట్స్!

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 19.50 కోట్లు జరిగింది. పబ్లిసిటీ, ప్రింట్లు ఖర్చులు కలుపుకుంటే కలుపుకుంటే మరో రెండు నుంచి మూడు కోట్లు అవుతాయి. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్  కావాలంటే 22 కోట్ల షేర్ వస్తే సరిపోతుంది. ఏరియావైజ్ బ్రేకప్ లిస్ట్ చూద్దాం:

ఏరియా                                   బిజినెస్ (కోట్లలో)

--------------------                ----------------------------------------

నైజాం..............................        6.00

సీడెడ్................................      2.75

నెల్లూరు................................   0.65

కృష్ణ.......................................  1.25

గుంటూరు................................ 1.50

వైజాగ్ ....................................  1.95

ఈస్ట్ గోదావరి............................ 1.25

వెస్ట్ గోదావరి............................. 1.05

మొత్తం ఆంధ్రా & తెలంగాణా.... 16.40

కర్ణాటక ...................................... 1.10

భారత్ లో మిగతా ప్రాంతాలు.....   0.50

ఓవర్ సీస్ ..................................  1.50

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.19.50 కోట్ల వరకు జరిగింది. 

 2019లో రవితేజ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. దీంతో ఆ లోటును ‘డిస్కో రాజా’ను భర్తీ చేస్తుందని రవితేజ భావిస్తున్నాడు. దానికి తోడు సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో రవితేజ తొలిసారి నటిస్తుండటం విశేషం. ‘ఎక్కడికిపోతావ్‌ చిన్నవాడా, ఒక్క క్షణం’ లాంటి భిన్నమైన చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వీఐ ఆనంద్‌.. రవితేజతో ఓ కొత్త ప్రయోగం చేసారని చెప్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios