చిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గీతా కృష్ణ. తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మలయాళీ చిత్ర పరిశ్రమపై, కాజల్, ఇలియానాలపై గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా కృష్ణ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇతర ఇండస్ట్రీలతో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

గీతా కృష్ణ మాట్లాడుతూ.. బాలీవుడ్ కు ఎవరైనా పోటీ ఇస్తున్నారు అంటే అది టాలీవుడ్ మాత్రమే. మిగిలిన భాషా చిత్రాలకు అంత సీన్ లేదు. మనకు కాస్తో కూస్తో పోటీ నిచ్చేది తమిళ చిత్ర పరిశ్రమేనని అన్నారు. మలయాళం మన దరిదాపుల్లోకి కూడా రాదు. అక్కడంతా పులిహోరగాళ్లే. మలయాళంలో అక్కడి చిత్రాలకంటే అల్లు అర్జున్ చిత్రాలే బాగా రాణిస్తుంటాయి అని గీతా కృష్ణ అన్నారు. 

తాను హీరోయిన్లకు ప్రాధాన్యతనిచ్చే దర్శకుడిని అని చెప్పుకున్నారు. ఇప్పటి దర్శకులలాగా నేను హీరోలని హైలైట్ చేయను. హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తూ వారిని అందంగా చూపిస్తా అని అన్నారు. కొన్ని రోజుల క్రితం ఓ చిత్రం గురించి నా స్టూడెంట్స్ తో డిస్కషన్ చేస్తుండగా.. ఇలియానా, కాజల్ ని పెడదామా అని అడిగాను. వాళ్లిద్దరూ ఆంటీలు సర్ అని నా స్టూడెంట్స్ అన్నారని గీతా కృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ఇస్మార్ట్ శంకర్ బీభత్సం.. ఇది ఎక్కడ ఆగుతుందో!

ఆర్టిస్టులకు మంచి రెమ్యునరేషన్ ఇవ్వాలన్నా, మంచి ఫుడ్ పెట్టాలన్నా టాలీవుడ్ తర్వాతే ఎవరైనా. సమంత, తమన్నా, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లకు టాలీవుడ్ లో ఇచ్చినంత రెమ్యునరేషన్ తమిళ, మలయాళీ భాషల్లో ఉండదు. వాళ్లకు అంత స్తోమత లేదని గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు.  

అలా చేస్తే అతడి తల నరుకుతా.. స్టార్ హీరోకి బెదిరింపులు