సినిమాకు నెగిటివ్ టాక్ రాగానే రివ్యూ రైటర్స్ పై మండిపటం ఈ మధ్యన ఓ ట్రెండ్ గా మారిన సంగతి తెలిసిందే. తాము చాలా కష్టపడి సినిమా తీసామని, ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిందని, మధ్యలో రివ్యూలే సినిమాని జనాలు చూడకుండా చేసేస్తున్నాయని వాపోతూంటారు. అయితే రిలీజ్ రోజు తమ సినిమాకు ఆశించిన రెస్పాన్స్ రాకపోయినా, నెగిటివ్ టాక్ స్ర్పెడ్ అయినా బాధ రావటం సహజం. అయితే సక్సెస్ మీట్ అని పెట్టి...సక్సెస్ లేకుండా రివ్యూలు చేస్తున్నాయని ..వారిపై కోప్పడటమే చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. నిన్న రిలీజైన  ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ సక్సెస్ మీట్ లో  దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి రివ్యూ రైటర్స్ పై ఓ రేంజిలో మండిపడ్డారు.

అలియా భట్ తో పార్టీ మూడ్ లో విజయ్ దేవరకొండ.. వైరల్ వీడియో!

 దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ..." మా సినిమా ఫుల్ కామెడీ చేస్తున్నా అని మొదటి నుంచీ చెప్తున్నా...నేను శంకరాభరణం తీస్తున్నా, స్వాతిముత్యం తీస్తున్నా అని ఎవరికీ చెప్పలేదు. కొందరు వెబ్ సైట్స్ వాళ్లు రేటింగ్ విషయంలో...సినిమాని తక్కువ చేసి పెడుతున్నారు. మేము ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అని చెప్పాం...అదే తీసాం..జనం థియోటర్స్ లో నవ్వుతున్నారు. ఇక మీ రేటింగ్ ఏమిటో అర్దం కావటం లేదు. నవ్వులకు రేటింగ్ ఏమిటి...నేనేమన్నా అవార్డ్ విన్నింగ్ సినిమా తీసానా..లేక ప్రపంచంలో  అత్యుత్తమైన సినిమాను తీస్తున్నాను..ఆస్కార్ అవార్డ్ కు పంపిస్తున్నాను అని నేను చెప్పలేదు. అలాంటి సినమా మీరు చేయాలనుకుంటే మీరు చేయండి..మీరు తీసి ఆస్కార్ అవార్డ్ లకు పంపి...మేము భీబత్సమైన సినిమా తీసాం అని తొడగొట్టి మీసం తిప్పండి..మేము ఎంటర్టైన్మెంట్ సినిమా తీసాం...థియోటర్ లో జనం తెగ నవ్వుతున్నారు.

విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు ఫోన్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి సినిమా  బ్రహ్మాండంగా ఉంది.మా కమీషన్స్ మాకు వస్తోంది.. పబ్లిసిటీ బాగా చెయ్యమంటున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు పెట్టి కొంటారు. మనలా ఫ్రీగా పెన్ను పెట్టి పేపరు, పెన్ను ఉందని రాయరు. వాళ్లకన్నా మనం గొప్పోళ్లం కాదు. సినిమా నచ్చకపోతే రాయద్దు. తిట్టద్దు. ప్రేక్షకులకు నచ్చింది..అది చాలు. పనిగట్టుకుని సినిమాకు రాకుండా చేయద్దు అన్నారు. ఒక్క రివ్యూ పైనా చాలా మంది లైఫ్ లు ఆధారపడి ఉంటాయి. రివ్యూలని ఎక్కడో పొలాల్లో ఉన్న రైతు,కూలీలు కూడా చూస్తున్నాను...కమర్షియల్ సినిమాలు,కామెడీ సినిమాలు పిచ్చి సినిమాలు కావు.జనాలకు అవే కావాలి" అన్నారాయన

సందీప్‌ కిషన్, హన్సిక జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అన్నది ఉపశీర్షిక. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్‌.ఎన్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌ రెడ్డి, రూపా జగదీష్‌ నిర్మించిన ఈ సినిమా నిన్న శుక్రవారం (నవంబర్ 15న) విడుదల అయ్యింది.