Asianet News TeluguAsianet News Telugu

దిల్ రాజు ద్వితీయ వివాహం జరిగిపోయిందా?

నిజానికి ఇది అంత చర్చించుకోదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఒకరి వ్యక్తిగత జీవితానికి సంభందించింది. కానీ సెలబ్రెటీలకు వ్యక్తిగతాలు కూడా ఈ రోజున మీడియా హైలెట్ చేస్తూ వస్తోంది.

Dil Raju second marriage is a private ceremony
Author
Hyderabad, First Published Feb 26, 2020, 8:43 PM IST

నిజానికి ఇది అంత చర్చించుకోదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఒకరి వ్యక్తిగత జీవితానికి సంభందించింది. కానీ సెలబ్రెటీలకు వ్యక్తిగతాలు కూడా ఈ రోజున మీడియా హైలెట్ చేస్తూ వస్తోంది. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు(49) రెండో పెళ్ళి చేసుకున్న‌ట్టు మీడియాలో ప్ర‌చారం మొదలైంది. గత రోజులుగా ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారు, అమ్మాయిని చూస్తున్నారు వంటి వార్తలే వచ్చాయి.

కానీ ఇప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబర్స్  ఒత్తిడితో త‌న కుటుంబంలోని  30 ఏళ్ళ అమ్మాయిని వివాహ‌మాడిన‌ట్టు తెలుస్తుంది. ప్రైవేట్ వేడుక‌గా జ‌రిగిన ఈ పెళ్ళిలో కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్నార‌ని అంటున్నారు.  ఈ వార్త‌కి సంబంధించి నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇక దిల్ రాజు భార్య అనిత మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య గుండెపోటుతో మ‌ర‌ణించారు. అప్ప‌టి నుండి సింగిల్‌గా ఉన్నారు.

స్టన్నింగ్ బ్యూటీ.. ఈషా రెబ్బ స్టైలిష్ అండ్ హాట్ లుక్స్

కెరీర్ విషయానికి వస్తే...దిల్ రాజు నిర్మించిన జాను చిత్రం రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, వర్కవుట్ కాలేదు. త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం 96కి రీమేక్‌గా జాను చిత్రం తెర‌కెక్కిన ఈ సినిమా కమర్షియల్ డిజాస్టర్ అయ్యింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో పింక్ రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్‌లో రిలీజ్  చేయనున్నారు.అలాగే సంక్రాంతికి డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన రెండు చిత్రాలు సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో ...మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.    

అశ్లీల వెబ్ సైట్ లో హీరోయిన్ ఫోన్ నంబర్.. అతడి పనే ఇది!

ఇదిలా ఉంటే ఈ సంవత్సరం దిల్ రాజు ..హిందీ పరిశ్రమలోనూ నిర్మాతగా అడుగు పెడుతున్నారు.  తెలుగులో గతేడాది విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన జెర్సీ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. ఇటీవలే కబీర్ సింగ్ రీమేక్ తో తిరిగి హిట్ ట్రాక్ లో పడ్డ షాహిద్, జెర్సీ రీమేక్ తో మరో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios