టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పింక్ రీమేక్ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు నిర్మాత దిల్ రాజు కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్క బోయే సినిమా వచ్చే సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. పవన్ సినిమాలు స్టార్ట్ చేసి అభిమానులకు ఒక విధంగా మంచి కిక్కిచ్చాడు.

అయితే పింక్ రీమేక్ సినిమా షూటింగ్ మొదటి వారం రోజులు బాగానే కొనసాగింది. కానీ అనుకోని విధంగా పవన్ రెగ్యులర్ పాలిటిక్స్ లోనే ఎక్కువగా దర్శనమిస్తున్నాడు. దర్శక నిర్మాతలకు పవన్ ముందే ఈ విషయాన్ని చెప్పాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనకపోవచ్చు అని అగ్రిమెంట్ చేస్తుకున్నారు.  అందుకు దిల్ రాజు కూడా ఒప్పుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం చిత్ర యూనిట్ పవన్ తీరుకు కన్ఫ్యూజన్ లో పడ్డారట.

ఎందుకంటె క్యాన్సిల్ అయిన షెడ్యూల్స్ ని మళ్ళీ సెట్ చేసుకోవాలంటే ఇతర నటీనటుల డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అనుకున్న సమయానికి వేరే వాళ్ళు దొరకలేరు. దీంతో నిర్మాతకు కొంత ఇబ్బంది తప్పడం లేదు. కానీ పవన్ కూడా చాలా వరకు సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ట్రై చేస్తున్నప్పటికీ ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల కారణంగా కుదరడం లేదు. ఇక పింక్ రీమేక్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావడం లేదు.

ఇక సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన సగం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ లేకపోయినప్పటికీ మిగతా నటీనటులతో చాలా వరకు సీన్స్ షూట్ చేస్తున్నారట. ఇక పవన్ ఖాళి సమయం దొరికితే అర్ధరాత్రులు కూడా షూటింగ్లలో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక త్వరలో క్రిష్ తో కూడా ఒక హిస్టారికల్ సినిమాని స్టార్ట్ చేయాలనీ చూస్తున్న పవన్ ఆ సినిమాను ఎంత స్పీడ్ గా పూర్తి చేస్తాడో చూడాలి.