Asianet News TeluguAsianet News Telugu

స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చేసిన హీరోయిన్!

రాజస్తాన్ రాజధాని జైపూర్ లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్ కి సోమవారం ఆమె హాజరయ్యారు. వాతావరణ మార్పు అంశం చర్చ సందర్భంగా దియా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. 

Dia Mirza Breaks Down At Jaipur Literature Festival
Author
Hyderabad, First Published Jan 28, 2020, 4:17 PM IST

ఏడవడానికి భయపడకూడదని, బాధను ధైర్యంగా వ్యక్తపరచాలని బాలీవుడ్ భామ దియా మీర్జా అన్నారు. తనివితీరా ఏడవడం వలన మనసుకి ఉపసమనం కలుగుతుందని అన్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్ లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్ కి సోమవారం ఆమె హాజరయ్యారు.

వాతావరణ మార్పు అంశం చర్చ సందర్భంగా దియా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. అమెరికా బాస్కెట్ బాల దిగ్గజం కొబ్ బ్రియాంట్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఎమోషనల్ అయ్యారు. జనవరి 26.. ఉదయం మూడు గంటల సమయంలో తన అభిమాన ఎన్‌బీఏ ఆటగాడు చనిపోయాడనే వార్తతో రోజు మొదలైందని.. కాలిఫోర్నియాలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిందనే వార్త తనను తీవ్ర వేదనకి గురి చేసిందని అన్నారు.

మ్యాన్ వర్సెస్ వైల్డ్ : అప్పుడు మోడీ.. ఇప్పుడు రజినీకాంత్!

పూర్తి నిరాశలో కూరుకుపోయానని.. బీపీ లెవెల్స్ పడిపోయాయని.. మన రోజువారీ జీవితంలో ఇలాంటి ప్రమాదాలు, వివిధ విషయాలు మనల్ని అగాథంలోకి నెట్టేస్తాయని అన్నారు. మనోనిబ్బరంతో ఉండాలని.. ఎదుటివారి బాధను మన బాధగా భావించి వారికి అండగా ఉండాలని అన్నారు.

ఇది నటన కాదని.. ఇలా కన్నీళ్లు కార్చడం ద్వారా భారం తగ్గినట్లుగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. కాగా.. అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌, కోచ్‌ కోబ్‌ బ్రియాంట్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్ లో బ్రియాంట్‌ కూతురు గియానా కూడా మృత్యువాత పడింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios