బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ దీపికా పదుకొనె మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాను నటించిన సినిమాల ప్రమోషన్స్ చేయడంలో అమ్మడు  చాలా స్పీడ్ గా ఉంటుంది. ప్రమోషన్స్ తో ఈజీగా జనాలకీ తన సినిమాలకు తెలిసేలా చేస్తుంది. ప్రస్తుతం దీపిక చేసిన ఒక టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ తో ఆమె టిక్ టాక్ వీడియో చేసింది.  అసలు మ్యాటర్ లోకి వెళితే..15 ఏళ్ల వయసులో యాసిడ్ దాడికి గురైన లక్ష్మి అగర్వాల్ పాత్రను ఆధారంగా చేసుకొని ఛపక్ సినిమాను తెరకెక్కించారు. అందులో దీపిక లక్ష్మి పాత్రలో నటించింది. ఇటీవల లక్ష్మితో కలిసి దీపికప్రమోషన్స్ లో పాల్గొంది. టిక్ టాక్ లో చేసిన వీడియోస్ కి అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

@deepikapadukone

Swaaaag Se Swaagat!😎@awezdarbar @riyaz.14 @faby_makeupartist @nagmaa @gunjanshouts @thelaxmiagarwalpihu

♬ original sound - deepikapadukone

స్టాప్ సేల్ యాసిడ్ అనే నినాదంతో యాసిడ్ ల విక్రయాన్ని ఆపేసిన ఘనత ఆమెది. అప్పటి నుంచి యాసిడ్ ఘటనలు తగ్గాయి. తనను ప్రేమించలేదని నయీమ్ ఖాన్ అనే వ్యక్తి లక్ష్మిపై యాసిడ్ దాడి చేశాడు. అయితే ఎంతో మనోవేధనలో కూడా లక్ష్మి దైర్యంగా నిలబడి కొత్త తరహాలో జీవితాన్ని గెలిచి అందరికి ఆదర్శంగా నిలిచింది.ప్రపంచ వ్యాప్తంగా ఆమె యాసిడ్ ఘటనలు జరగకూడదని ప్రచారాలను మీటింగ్ లను నిర్వహించి యాసిడ్ బాధితులకు సైతం అండగా నిలిచింది.

@deepikapadukone

Boom Boom Pow!👊🏽 @ur_smartmaker

♬ original sound - deepikapadukone

అలాంటి వనిత పాత్రలో దీపిక పదుకొనె నటించి దేశాన్ని ఆకర్షించింది. రాజి సినిమాతో దర్శకురాలిగా మంచి ప్రశంసలు అందుకున్న మేఘన గుల్జర్ ఆ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇకపోతే ఫాక్స్ స్టార్ స్టూడియోస్ తో కలిసి దీపిక సొంతంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 10న ఛపక్ సినిమా రిలీజ్ కానుంది.