Asianet News TeluguAsianet News Telugu

సినీ కార్మికులు, వైద్య సిబ్బంది సంక్షేమం కోసం ద‌గ్గుబాటి ఫ్యామిలీ భారీ సాయం

రోజువారీ వేత‌నంతో ప‌నిచేసే సినీ కార్మికులు నిత్యావ‌రాల కోసం క‌ష్ట‌ప‌డుతున్నార‌నీ, వాళ్ల‌ను ఆదుకోవ‌డం త‌మ బాధ్య‌త‌గా భావించి, వారికి ఆర్థిక సాయాన్ని అంద‌జేస్తున్నామ‌నీ సురేశ్‌బాబు, వెంక‌టేశ్‌, రానా తెలిపారు. వారికోసం కోటి రూపాయలు సాయం సాధిస్తున్నట్టుగా ప్రకటించారు.

Daggubati Family Suresh productions donates Rs 1 Cr for corona relief
Author
Hyderabad, First Published Mar 28, 2020, 12:53 PM IST

క‌రోనాపై పోరాటంలో ద‌గ్గుబాటి ఫ్యామిలీ త‌మ వంతు భాగ‌స్వామ్యం అందించేందుకు ముందుకు వ‌చ్చింది. క‌రోనా వ్యాప్తి నిరోధంలో నిరంత‌రం శ్ర‌మిస్తోన్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం, సినిమా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద క‌ళాకారులు, సినీ కార్మికుల సంక్షేమం కోసం సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌ కోటి రూపాయ‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించింది.

రోజువారీ వేత‌నంతో ప‌నిచేసే సినీ కార్మికులు నిత్యావ‌రాల కోసం క‌ష్ట‌ప‌డుతున్నార‌నీ, వాళ్ల‌ను ఆదుకోవ‌డం త‌మ బాధ్య‌త‌గా భావించి, వారికి ఆర్థిక సాయాన్ని అంద‌జేస్తున్నామ‌నీ సురేశ్‌బాబు, వెంక‌టేశ్‌, రానా తెలిపారు. అలాగే త‌మ జీవితాల‌కు ప్ర‌మాదం అని తెలిసినా నిత్యం రోగుల‌తో స‌న్నిహితంగా మెల‌గుతూ వారి ఆరోగ్యం కోసం నిరంత‌రం శ్ర‌మిస్తూ వ‌స్తున్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం ఆర్థిక సాయాన్ని అంద‌జేస్తున్నామ‌ని చెప్పారు.

ఈ సంక్షోభ కాలాన్ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌డానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తోన్న లాక్‌డౌన్‌ను ప్ర‌జ‌లంద‌రూ విధిగా పాటించాల‌ని సురేశ్‌బాబు, వెంక‌టేశ్‌, రానా కోరారు. అత్య‌వ‌స‌రం అయితేనే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకొని బ‌య‌ట‌కు వెళ్లాల‌ని, గుంపులుగా మాత్రం వెళ్ల‌వ‌ద్ద‌ని వారు చెప్పారు. అంద‌రూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ, ప్ర‌భుత్వాల‌కు స‌హ‌క‌రిస్తూ క‌రోనాపై పోరాటంలో విజ‌యానికి తోడ్ప‌డాల‌ని సురేశ్‌బాబు విజ్ఞ‌ప్తి చేశారు. అంద‌రూ త‌మ త‌మ ఇళ్ల‌ల్లోనే సుర‌క్షితంగా ఉండాల‌ని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios