స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సంక్రాంతికి విడుదలై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. బాహుబలి తర్వాత టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ళలో బాహుబలి తరువాతి స్థానంలో నివ్వడంతో ఇండస్ట్రీ వర్గాలు సైతం ముక్కున వేలేసుకున్నాయి. 

అల్లు అర్జున్, పూజా హెగ్డే ఈ చిత్రంలో జంటగా నటించారు. టబు, జయరాం కీలక పాత్రల్లో మెరిశారు. ప్రస్తుతం తెలుగులో హిట్ అయిన చిత్రాలకు హిందీలో మంచి డిమాండ్ ఉంది. అలవైకుంఠపురములో చిత్రం ఘనవిజయం సాధించడంతో ఈ చిత్రంపై బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్నుపడింది. 

క్రికెటర్ తో ఎఫైర్, పెళ్లయ్యాక ఫుల్ స్టాప్.. మంచు మనోజ్ హీరోయిన్ రెచ్చిపోతోందిగా!

తాజా సమాచారం మేరకు బాలీవుడ్ నిర్మాత అశ్విన్ వర్దె భారీ మొత్తానికి అల వైకుంఠపురములో చిత్ర రీమేక్ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి చిత్రాన్ని షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేసింది ఈ నిర్మాతే. హిందీలో అర్జున రెడ్డి చిత్రం కబీర్ సింగ్ గా తెరకెక్కి విజయం సాధించింది. 

అల వైకుంఠపురములో చిత్రాన్ని కూడా షాహిద్ కపూర్ తోనే తెరకెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే షాహిద్ కపూర్ వరుసగా మూడో తెలుగు చిత్రాన్ని రీమేక్ చేసినట్లు అవుతుంది. ఇదివరకే అర్జున్ రెడ్డి  రీమేక్ లో నటించిన షాహిద్.. ప్రస్తుతం జెర్సీ రీమేక్ లో నటిస్తున్నాడు.