Asianet News TeluguAsianet News Telugu

కరోనా క్రైసిస్ : విరాళం ప్రకటించిన బ్రహ్మానందం

 కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న  వాళ్లలో సినీ కార్మికులు కూడా ఉన్నారు.  ఈ క్రమంలో  హీరో చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కు అందరూ సపోర్ట్ చేస్తున్నారు.  ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన వంతు విరాళం ప్రకటించారు. 

Comedian Brahmanandam donation to Corona Crisis Charity
Author
Hyderabad, First Published Apr 10, 2020, 3:08 PM IST


కరోనా విజృంభణతో అందరూ విలవిల్లాడుతున్నారు. వైరస్ కట్టడికి కేంద్రం 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో చాలా మంది పేదలకు పనిలేకుండా పోయింది. ముఖ్యంగా లో మిడిల్ క్లాస్ వాళ్ల అవస్దలు చెప్పనలవి కాదు. పనికెల్తేనే పొట్టగడిచే వాళ్లు ఎవరినీ చేయి చాచి అడగలేని  పరిస్దితి. ఈ నేపధ్యంలో ఈ పరిస్దితిని అర్దం చేసుకుని సెలబ్రిటీలు   ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని ఉదారతను ప్రకటించుకుంటున్నారు.

 ఎవరికీ తోచిన రీతిలో వారు తమ వంతు సాయం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న  వాళ్లలో సినీ కార్మికులు కూడా ఉన్నారు.  ఈ క్రమంలో  హీరో చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కు అందరూ సపోర్ట్ చేస్తున్నారు.  ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన వంతు విరాళం ప్రకటించారు. సినీ కార్మికులకు ఆసరాగా ఉండేందుకు రూ.3 లక్షల విరాళం ఇస్తున్నట్టు చారిటీకి తెలిపారు. 

ఇక ఇప్పటికే ప్రభాస్, పవన్ , బాలకృష్ణ, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లుఅర్జున్ , సాయిధరంతేజ్, నితిన్ లతో పాటు పలువురు దర్శక నిర్మాతలు కూడా తమ వంతు విరాళాలను ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios