రియల్ లైఫ్ మామ అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటిస్తున్న చిత్రం వెంకీమామ. డైరెక్టర్ బాబీ దర్శత్వంలో సురేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ, చైతు మామ అల్లుళ్లు గానే నటిస్తున్నారు. ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ నటిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఈ చిత్ర విడుదల విడుదల తేదీపై సందిగ్దత నెలకొని ఉన్న సమయంలో సడెన్ గా రిలీజ్ డేట్ ప్రకటించారు. డిసెంబర్ 13న వెంకిమామ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే వెంకిమామ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టేసింది. 

తాజాగా ఈ చిత్రంలోని 'కోకోకోలా పెప్సీ మామ అల్లుడు సెక్సీ' అనే మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటలోని మాస్ లిరిక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సంగీత దర్శకుడు తమన్ మంచి ట్యూన్ అందించాడు. తాజాగా విడుదల చేసిన లిరికల్ విడియోలోని విజువల్స్ చూస్తే వెంకీ, చైతు స్టెప్పులు.. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ప్రధాన ఆకర్షణ కాబోతున్నట్లు తెలుస్తోంది. 

కాసర్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యం అందించగా.. అదితి భవరాజు, రమ్య బెహ్రా, సింహ, హనుమాన్ గాత్రం అందించారు. వెంకీమామ చిత్రంలో యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్ని అంశాలు ఉంటాయని దర్శకుడు బాబీ పేర్కొన్నారు.