మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య (చిరు 152) ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న ప్రముఖ దర్శకుడు,మరియు రచయిత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కొణిదెల అధినేత రామ్ చరణ్  నిర్మిస్తున్న ఈ చిత్రం...హైదరాబాద్ కోకాపేట పరిసరాల్లో షూటింగ్ సాగుతోంది. ఇక ఈ చిత్రం గురించి రకరకాల వ్యాఖ్యానాలు మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో చిరు పాత్ర గురించి చర్చ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ స్టిల్ లీక్ అయ్యింది.

ఈ ఫోటో చూడగానే అప్పటిదాకా చిరంజీవి నక్సలైట్ పాత్ర అనుకునే వాళ్లంతా అదేం కాదు... ప్రజా నాట్యమండలి కళాకారుడు అంటున్నారు. చిరు ఫ్యాన్స్ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.  దేవాదాయ శాఖ భూకుంభకోణానికి సంబంధించిన కథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారని అందులో ఓ పాత్ర నక్సలైట్ అంటూ ప్రచారం సాగుతున్న క్రమంలో ఈ లీక్ లుక్ అనుమానాలకు తావిస్తోంది.

మరో ప్రక్క ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ లేదా వేరెవ‌రైనా ప్ర‌ముఖ హీరో న‌టిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అలాగే త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుందని సమాచారం.గతంలో చిరు సరసన త్రిష చేసింది. ఇక  ‘ఆచార్య’ అనే టైటిల్ రిజిష్టర్ చేయించారని తెలుస్తోంది.