కాస్టింగ్ కౌచ్ లో నటి శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఎన్నో ఆరోపణలు చేసింది. ఈమెపై గతంలో చాలా మంది పోలీస్ కంప్లైంట్స్ చేశారు.

తాజాగా మరో నటి కూడా శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేసింది. సినిమా ఇండస్ట్రీలో కొందరు కథానాయకులు, నటులతో పాటు తనను కూడా లక్ష్యంగా చేసుకొని నటి శ్రీరెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేస్తోందని కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు.

నీకు ఎంత మంది మొగుళ్ళో నాకు తెలుసు.. నటిపై శ్రీరెడ్డి బూతుపురాణం

ఫేస్ బుక్ వేదికగా తనను తిడుతూ ప్రత్యక్ష ప్రసారం చేస్తోందంటూ.. ఆ మేరకు వాటిని పోలీసులకు చూపారు. ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నందున కేసు పెట్టాలని ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ కి అభ్యర్ధించారు. వాటిని పరిశీలించి ఐటీ చట్టం 67 సెక్షన్ తో పాటు ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఏసీపీ వివరించారు.