దేశంలో రోజురోజుకి అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడిన వారిని తక్షణమే శిక్షించే చట్టాలు లేకపోవడం బాధాకరం. ఇటీవల హైదరాబాద్ లో చోటు చేసుకున్న దిశ హత్యాచార కేసు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నాలుగు మానవ మృగాలు అత్యంత క్రూరంగా అమ్మాయిని రేప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. 

ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని దేశం మొత్తం కోరుకుంటుంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ ఘటనపై స్పందిస్తున్నారు. అయితే ఓ యంగ్ ఫిల్మ్ మేకర్ మాత్రం ఆడవాళ్లను రేప్ చేసేప్పుడు సహకరించమని అసహ్యమైన సలహాలు ఇస్తున్నారు.

''ఆడపిల్లలు బయటికి రాకూడదా? రాత్రిళ్లు తిరగకూడదా?''

డేనియల్ శ్రవణ్ అనే దర్శకుడు.. హత్యలకు గురికాకుండా ఉండాలంటే ఆడవాళ్లు అత్యాచారం చేస్తున్నప్పుడు సహకరించాలని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. అక్కడితే ఆగలేదు. రేపిస్ట్ లు అత్యాచారం చేసి చంపడానికి కారణం మహిళా సంఘాలు, సమాజమేనని చెప్పాడు.

ప్రభుత్వం రేప్ ని, రేపిస్ట్ లను లీగల్ చేస్తే అత్యాచారం చేసిన తరువాత చంపాలనే ఆలోచన రేపిస్ట్ లకు రాదని అర్ధం లేని పోస్ట్ పెట్టాడు. దిశా హత్యకు కారణం ఆ నలుగురు  వ్యక్తులు కాదని.. ప్రభుత్వం, మహిళా సంఘాలేనని చెప్పాడు. మగవాళ్లు రేప్ చేసేప్పుడు సహకరించాలని, లేకపోతే ఎక్కడ పోలీసులకు చెప్తారోననే భయంతో వాళ్లని చంపేస్తున్నారని.. ప్రభుత్వం రేపిస్ట్ లపై ఎలాంటి చట్టాలు రుద్ద్కపోతే వాళ్లు కూడా ఆడవాళ్లను హత్యలు చేయరని అన్నాడు. 

రేప్ అనేది సీరియస్ విషయం కాదని, కానీ హత్యా చాలా పెద్ద నేరమని, ఆడవాళ్లు హత్యలకు గురి కాకుండా ఉండాలనే రేప్ ని లీగల్ చేయడమే పరిష్కారమని చెప్పాడు. పోలీసులకు ఫోన్ చేసే బదులు హ్యాండ్ బ్యాగ్ లో  కండోమ్స్ పెట్టుకోవాలని.. దీని వలన ప్రాణాలు దక్కుతాయని ఇష్టమొచ్చినట్లు వాగాడు. దీంతో నెటిజన్లు డేనియల్ శ్రవణ్ ని టార్గెట్ చేశారు. ప్రముఖ సింగర్ చిన్మయి సైతం ఇతడిపై విరుచుకుపడింది.