Asianet News TeluguAsianet News Telugu

ప‌వ‌న్,క్రిష్ సినిమాకి కొత్త‌ సమస్య.. తలపట్టుకున్న నిర్మాత

పాలటిక్స్  కోసం రెండేళ్లకు పైగా లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వరసగా మూడు సినిమాలు మొదలెట్టిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్,  హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక చిత్రం, క్రిష్ దర్శకుడిగా ఓ పీరియాడిక్ మూవీ పవన్ ప్లాన్ చేసారు.

Budget Issues for Pawan, Krish movie
Author
Hyderabad, First Published Feb 16, 2020, 11:57 AM IST

పాలటిక్స్  కోసం రెండేళ్లకు పైగా లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వరసగా మూడు సినిమాలు మొదలెట్టిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్,  హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక చిత్రం, క్రిష్ దర్శకుడిగా ఓ పీరియాడిక్ మూవీ పవన్ ప్లాన్ చేసారు.  ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిగతా రెండు సినిమాలు ఏ సమస్యా లేవు కానీ...క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా  కి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఊహించని విధంగా  ఈ సినిమాకు ఓ కొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. అదే బ‌డ్జెట్ విషయంలో ఇబ్బందులు ఎదురౌతున్నట్లు సమాచారం.

మొదట ఈ సినిమా బడ్జెట్ వంద కోట్లు అని అంచనా వేసారు. ఈ వందకోట్లలో పవన్ కు రెమ్యునేషన్ గా 50 కోట్లు ఇవ్వనున్నారు. మిగతా యాభై కోట్లలో సినిమాని పూర్తి చేయాలి. అయితే ఇది పీరియడ్ చిత్రం కావటంతో యాభై కాస్తా ఎనభై దగ్గర కు వెళ్తోందిట. ఈ సినిమాకు భారీ సెట్స్ అవసరం అని, అందుకోసమే దాదాపు ముప్పై కోట్లు దాకా ఖర్చు పెట్టాలని అంచనా వేసారట. దానికి తోడు ఈ సినిమాలో భారీగా స్టార్ కాస్టింగ్ ఉండబోతోందిట. వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న క్రిష్ ...ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడదలుచుకోలేదట.

తను కాంప్రమైజ్ అయితే మరోసారి ఎన్టీఆర్ బయోపిక్ అవుతుందని భయపడుతున్నారట. అంతేకాకుండా ఈ సిసిమాకు హై ఎండ్ టెక్నీషియన్స్ ని తీసుకుంటున్నారట.  కాకపోతే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడుతోంది. ఇలా బడ్జెట్ పెరిగిపోతే బిజినెస్ ఆ స్దాయిలో చేయాలి. రిస్క్ పెరుగుతుంది. దాంతో క్రిష్ ని పిలిచి నిర్మాత ఖచ్చితంగా చెప్పేసారట. ఈ సినిమాకి వీలైనంత‌గా బ‌డ్జెట్ త‌గ్గించాల‌ని అన్నారట. అలాగని ఏదో చుట్టేసినట్లు సినిమా ఉండకూడదు. క్వాలిటీ తగ్గ కూడదు. అవన్నీ చూసుకుంటూ... ఎక్కడ బడ్జెట్ కు కోత పెట్టచ్చో అని చూస్తున్నారట.  

అలాగే ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపిస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు ‘విరూపాక్షి’ అనే ఓ క్లాసిక్ టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో పవన్ పేరు వీరు అని దాంతో పాటు ఈ సినిమా కథకు కూడా ‘విరూపాక్షి’ టైటిల్ కూడా చక్కగా సరిపోతుందని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ‘పింక్’ రీమేక్ మే నెలలో విడుదలకానుండగా ఆ వెంటనే పెద్దగా గ్యాప్ లేకుండా ఈ చిత్రం కూడా విడుదలకానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios