రాకాసి కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనితో సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుటుంబంపై కూడా కరోనా ప్రభావం పడింది. 

లాక్ డౌ కారణంగా అమీర్ ఖాన్ పెద్ద కుమారుడు జునైద్ ఖాన్ ఫ్యామిలీకి దూరంగా మరో ప్రాంతంలో చిక్కుకుపోయాడు. అమీర్ ఖాన్ కుటుంబం మొత్తం ముంబైలోని పాలీ హిల్ లో నివసిస్తున్నారు. కానీ అమీర్ కొడుకు జునైద్ లాక్ డౌన్ కి ముందు పాంచ్ గానీ ప్రాంతంలోని బంగ్లాకు వెళ్ళాడు. ఈ ప్రాంతం ముంబై సిటీకి దూరంగా ఉంటుంది. 

ఐశ్వర్యారాయ్ డిజాస్టర్ మూవీ స్ఫూర్తితో ప్రభాస్ చిత్రం.. కథ ఇదే ?

లాక్ డౌన్ ప్రకటించడంతో జునైద్ అక్కడి నుంచి వచ్చి ఫ్యామిలీని కలుసుకోలేని పరిస్థితి. జునైద్ లాక్ డౌన్ కారణంగా బంగ్లాలోనే చిక్కుకుపోవడంతో అమీర్ ఖాన్ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 14 న లాక్ డౌన్ ముగుస్తుంది అని భావించినా.. ప్రభుత్వం తిరిగి మే 3 వరకు లాక్ డౌన్ ని పొడిగించింది. 

అమీర్ ఖాన్, అతడి మొదటి భార్య రీనా దత్తా సంతానమే జునైద్ ఖాన్. అమీర్, రీనా లకు జునైద్ ఖాన్, ఇరా ఖాన్ సంతానం. 2002లో వీరిద్దరూ విడిపోయారు. 2005 లో అమీర్ ఖాన్ కిరణ్ రావు ని రెండో వివాహం చేసుకున్నాడు.